గురువారం 09 ఏప్రిల్ 2020
Jagityal - Mar 10, 2020 , 02:04:49

ఘనంగా హోలీ సంబురాలు

ఘనంగా హోలీ సంబురాలు

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని హోలీ వే డుకలను చిన్నారులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. టవర్‌ సర్కిల్‌ ప్రాంతం, తాసిల్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌, పాత బస్టాండ్‌లో యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ పండుగను జరుపు కున్నారు. యువకులు ఎక్కువ మంది వివిధ రంగులు వాడకుండా, కుంకుమ గులాల్‌ వంటి సహజ రంగులతో ఆడుకోవడం కనిపించింది. 

మల్యాల (కొడిమ్యాల) : మండలంలో హోలీ  పండుగను పు రస్కరించుకొని కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో హోలీ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు, యువకులు, మహిళలు రంగులు చల్లుకొని నృత్యాలు చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల యు వకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

మల్యాల  : మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.    యువతీ, యుకులు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  

రాయికల్‌ రూరల్‌ : రాయికల్‌ మండల వ్యాప్తంగా హోలీ వే డుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. యువతీ, యువకులు పెద్ద ఎత్తున రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువకులు ద్విచక్రవాహనాల ర్యాలీలు తీసి రోజంతా పలు కార్యక్రమాల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. రాయికల్‌ ఎంపీపీ లావుడ్య సంధ్య సురేందర్‌ నా యక్‌, రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మండ్లు, ప్రము ఖ వైద్యులు మోర సుమన్‌, రోజ, సుజిత్‌ హోలి వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

సారంగాపూర్‌ : సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల్లోని ఆ యా గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పంచాయతీ సమీపంలో హోలీ సం బురాలు జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

 వినూత్నంగా వ్యవసాయ విద్యార్థుల సంబురాలు..

జగిత్యాల టౌన్‌ : పొలాస ప్రాంతీయ వ్యవసాయ కళాశాల విద్యార్థులు వినూత్న రీతిలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. కళాశాల మైదానంలో గల నల్ల రేగడి బురద మ ట్టిని పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరో నా ప్రభావంతో కళాశాలలో రంగులు వాడకుండా బురద నీటితో ఆడుతూ పాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ చైనా దేశం తయారు చేస్తున్న రంగులను మన దేశం దిగుమతి చేసుకుంటున్న మాట వాస్తవమే. అయినా కరోనా ప్రభావం ఉన్నందున హోలీ వేడుకలు రంగులతో కాకుండా బురద మట్టితో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.   వ్యవసాయ కళాశాల విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. 

జగిత్యాల రూరల్‌ :  జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండలాల్లో హోలీ సర్వదినాన్ని పురష్కరించుకొని సోమవారం ప్రజలు సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని యువతకులు, చిన్నారులు, మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.


logo