సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Mar 10, 2020 , 02:01:53

మూఢ నమ్మకాలపై పోలీస్‌ కళాజాతా

మూఢ నమ్మకాలపై పోలీస్‌ కళాజాతా

 మల్యాల (కొడిమ్యాల) : కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామంలో ఎస్పీ సింధూ శర్మ ఆదేశాల మేరకు ఎస్‌ఐ శివకృష్ణ  ఆధ్వర్యంలో మూఢ నమ్మకాల నిర్మూలనతో పాటు పలు అంశాలపై సోమవారం పోలీస్‌ కళా బృందం కళాజాతా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శివకృష్ణ మాట్లాడుతూ రోడ్డు  ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్‌ వాడకం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌లపై ప్రతినిత్యం తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు. మహిళా వేదింపులు, 100డయల్‌, సైబర్‌ నేరాలు, గల్ఫ్‌ మోసాలు, ఫ్రెండ్లీ పోలీస్‌, వయో వృద్ధ్దుల ఆలనా పాలనా పోలీస్‌ ఆధునిక చట్టాలపై కళా బృందం పాట లు పాడుతూ నాటికలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఏఎస్‌ఐ ముకీద్‌, పోలీస్‌ కళాబృందం సభ్యులు, నాయకులు, తదితరులున్నారు. logo