సోమవారం 30 మార్చి 2020
Jagityal - Mar 09, 2020 , 03:10:16

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

చిలుపూర్‌, మార్చి 08 : మహిళలు అన్ని రంగాల్లో ధై ర్యంతో ముందుకు సాగుతున్నారని, వారికి సరైన ప్రోద్బలాన్ని అందించాలని జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సర్పంచ్‌ కొంగర రవి అధ్యక్షతవహించగా, చైర్మన్‌ కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడు తూ వరంగల్‌ జిల్లా వీరవనితలకు పుట్టినిళ్లని, రాణిరుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మలను స్ఫూర్తిగా తీసుకుని మ హిళలు ముందుకు సాగాలని ఆయన కోరారు. మహిళలపై ఎలాంటి దుర్మార్గానికి ఒడిగట్టినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.  స్త్రీలను పురుషులతో స మానంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆడపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి బలమైన శక్తిగా ఉండే వి ధంగా చేయాలని కోరారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ ము నిపెల్లి సుధాకర్‌, పంచాయతీ కార్యదర్శి పీ మాధ వి, మహి ళా నాయకులు కనకతార, వెలిశాల రజిత, కరుణ, శమాదేవి, పోలెపల్లి రేణుక, మంతెన విజయరాణి పాల్గొన్నారు.  

సమాజంలో ప్రతి మహిళను గౌరవించాలి..

సమాజంలో మహిళలను గౌరవించినప్పుడే దేశం గౌ రవించబడుతుందని ఫత్తేపూర్‌ గ్రామ సర్పంచ్‌ బానోతు రూప్లానాయక్‌, వైస్‌ ఎంపీపీ భూక్య సరిత అన్నారు. మహి ళా దినోత్సవం సందర్భంగా ఫత్తేపూర్‌ గ్రామంలో ఆదివా రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మదర్‌ థెరిసా, చాకలి ఐలమ్మ చిత్రపటాల కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గ్రామ పారిశుధ్య కార్మికురాలు రాజమ్మను ఘనంగా స న్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సంద ర్భంగా గ్రామంలో యువసేన యూత్‌ సభ్యులు, జీపీ సి బ్బందితో కలిసి గ్రామంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో గెలుపొందిన యువకుల ను గ్రామస్తులు అభినందించారు. 

కార్యక్రమంలో టీఆర్‌ ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్‌, మాజీ ఎంపీటీసీ రవి, మాజీ సర్పంచ్‌ రాంలాల్‌, మమత వెంకటేశ్‌, నాయకులు మోహన్‌దాస్‌, రవి, మోహన్‌, భిక్షపతి, యువసేన యూత్‌ అధ్యక్షుడు బాలు, బాపునాయక్‌, రాజు, దినేశ్‌, వెంకటేశ్‌, అనీల్‌, రాహుల్‌, మహిళలు పాల్గొన్నారు.  

లింగంపల్లి, శ్రీపతిపల్లిలో..

మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్‌ కేసిరెడ్డి ప్రత్యుషారెడ్డి గ్రామ మహిళలను సన్మానించారు. లింగంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్‌ రవీందర్‌ మాట్లాడుతూ మహిళలపై పురుషులు వివక్ష చూపరాదని కోరారు. కార్యక్రమంలో సీఏలు ఏదునూరి రమాదేవి, శనిగరం వైష్ణవిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శోభ, సౌభాగ్యలక్ష్మి, రచ్చకృష్ణవేణి, తుత్తురు రజిత, మాటూరి రమ, మట్ట రజిత, అవుల మమతలు హాజరయ్యారు. 


logo