బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Mar 08, 2020 , 02:00:17

జేఎన్టీయూలో రోబోటిక్‌ వర్క్‌షాప్‌

జేఎన్టీయూలో రోబోటిక్‌ వర్క్‌షాప్‌

మల్యాల (కొడిమ్యాల): కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో రోబోటిక్స్‌పై రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వహంచారు. ప్రత్యేక సెమినార్‌ శనివారం ముగియగా ఆయా కళాశాలల నుంచి 100మందికి పైగా విద్యార్థులు హాజరై క్షేత్రస్థాయిలో చిన్నపాటి రోబోల తయారీని పరిశీలించారు. బైప్యాడ్‌ రోబో నాట్యం, నడక, ఫుడ్‌బాల్‌ ఆడుతుందని, దానికి సంబంధించిన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, సాంకేతికత గురించి కార్పొరేట్‌ మెంటర్‌ అన్వేశ్‌రెడ్డి తెలిపారు. రోబోలను తయారు చేసే విధానాన్ని వివరించారు. లైన్‌ ఫాలోవర్‌ రోబో నిర్దేశిత మార్గంలోనే నడిచేందుకు ట్రాక్‌ ప్యాడ్‌ను రూపొందించారు. రోబోకు అవసరమైన కోడింగ్‌, ఎన్‌కోడింగ్‌, డీ కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌, హార్డ్‌వేర్‌ తదితర ప్రత్యేక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, విభాగాధిపతుల తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  


రోబోలతో పనులు సులభతరం

రోబోల వినియోగించడంతో రాబోయే రోజుల్లో పనులు సులభతరమవుతాయి. కళాశాలలో రెండ్రోజుల పాటు వర్క్‌షాప్‌ నిర్వహించి అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ, ఎన్నో అప్లికేషన్లు, పాఠ్యాంశాలు, ప్రయోగాత్మకంగా రోబోల తయారీపై విద్యార్థులకు వివరించాం. ఒలింపిక్స్‌లో డ్రైవర్‌ లేకుండా రోబో సాయంతో కారు నడిపేలా పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో సర్వర్‌ లేకుండా రోబోల సాయంతో సేవలందిస్తున్నారు. 

-డాక్టర్‌ టీ వేణుగోపాల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి, జేఎన్టీయూ


logo