బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Mar 08, 2020 , 02:00:17

‘ఆ వ్యక్తికి కరోనా లేదు’

‘ఆ వ్యక్తికి కరోనా లేదు’

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయనే అనుమానంతో జిల్లా ఆరోగ్య శాఖ అ ధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. అక్క డి వైద్య బృందం పరీక్షలు నిర్వహించి అతడికి కరోనా వైరస్‌ సోక లేదని నిర్ధ్దారిం చారు. పది రోజుల పాటు ఇంట్లో వైద్య సేవలు తీసుకోవాలని సూచించారు. 

గోపాల్‌రావుపేటలో వైద్య శిబిరం

గోపాల్‌రావుపేట గ్రామంలో జిల్లా ఉప వైద్యాధికారి ముస్కు జైపాల్‌ రెడ్డి ఆధ్వర్యం లో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వ హించారు. ఈ సం దర్భంగా గ్రామం లో ని సుమారు 50 మం దికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాధిపై ఎలాంటి భయ బ్రాంతులకు గురి కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రౌతు జయ,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


logo