బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Mar 08, 2020 , 01:57:39

కోతికి అంత్యక్రియలు

 కోతికి అంత్యక్రియలు

పెగడపల్లి : మండలంలోని ఐతుపల్లిలో ఓ వానరం (కోతి)కి  గ్రామస్తులు శాస్ర్తోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆరు నెలలుగా స్థానిక సీతారామచంద్ర స్వామి ఆలయంలోనే ఉంటుంది. భక్తులు ఇచ్చే పండ్లు, కొబ్బరి ముక్కలు తిను కుంటూ, అందరికీ ఇష్టంగా మారిపోయింది. అలాంటి కోతి అనుకోకుండా అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందింది. కోతి మృతి వార్త విన్న గ్రామస్తులు ఆలయానికి చేరుకుని దు క్కించారు. కోతికి దహన సంస్కారాలు చేయాలని నిర్ణయిం చారు. శాస్ర్తోక్తంగా కోతికి పాలతో అభిషేకం చేసి, తులసీ తీర్థం పోసి పాడెను కట్టి, డప్పు చప్పుళ్ల  మధ్య గ్రామ సమీపంలోకి తీసుకెళ్లీ దహన సంస్కారాలు చేశారు. గ్రామంలో త్వరలోనే కోతికి విగ్రహం ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి సభ్యులు సీమల తిరు పతి, గాలి రా జ్‌కుమార్‌, ఆసరి భరత్‌, బొమ్మగోని శ్రీనివాస్‌, పంతుల రాము, సట్ట రవి, విలాసాగరం రవి పాల్గొన్నారు.


logo