శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Mar 07, 2020 , 01:10:33

ప్రగతి మెరిసె.. పట్నం మురిసె..

ప్రగతి మెరిసె.. పట్నం మురిసె..

జగిత్యాల/మెట్‌పల్లి/ ధర్మపురి, నమస్తే తెలంగాణ/కోరుట్లటౌన్‌/రాయికల్‌ :  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ పారిశుధ్య, విద్యుత్‌, ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు పనులు ఉధృతంగా సాగా యి. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన స్తంభా లు, రో డ్డుకు అడ్డంగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లూజ్‌ వైర్ల తొలగింపు పనులు వేగంగా సాగాయి. ప్రతి వీధుల్లోనూ మురికికాల్వలను పరిశుభ్రం చే యడంతో పాటుగా, ఖాళీ స్థలాలను శుభ్రం చేశారు. ప్రజల్లోనూ పరిశుభ్రత విషయంలో అవగాహన క ల్పించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సం రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.  అత్యవసరమైన ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్ల పనులు చేపట్టారు. 


 ధర్మపురిలో ..

ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులో ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ ప్రగతి పనులు విజయవంతం చేశారు. 34 కిలోమీటర్ల దూరం సీసీ రోడ్లకు గాను 31కిలోమీటర్ల మేర శుభ్రం చేశారు. 32 కిలోమీటర్ల మురుగు కాలువలకు గాను 28.5కిలోమీటర్ల మేర కాలువల్లో మురుగును తొలగించారు. 53వేల చదరపు మీటర్ల ఖాళీ స్థలాన్ని గుర్తించి, 15,860 చదరపు మీటర్ల స్థలంలో పిచ్చిమొక్కలను, పొదలు, ముండ్లకంపలను తొలగించారు. 689 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. పలు వీధుల్లో 320 ఎల్‌ఈడీ బల్బులు బిగించారు. 40 మంది మున్సిపల్‌ రెగ్యులర్‌ పారిశుధ్య సిబ్బందితో పాటు మరో 65 మంది ప్రైవేట్‌ సిబ్బందిని నియమించి పారిశుధ్య పనులు చేపట్టారు. మూడు ఎక్సవేటర్లు, ఆరు ట్రాలీ ట్రాక్టర్లు, మూడు బ్లేడ్‌ ట్రాక్టర్లును ఉపయోగించారు. గుర్తించి చేపట్టిన పనుల్లో పదిశాతం మేర మిగిలి ఉన్నాయనీ, నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తామని కమిషనర్‌ దివ్యదర్శన్‌రావు తెలిపారు.


జగిత్యాలలో ..

జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డుల్లో ప్రగతి పనులు చేపట్టారు. ముఖ్యంగా వీటి పరిధిలో పారిశుధ్య సమస్యలకు పరిష్కారం లభించింది. ప్రభుత్వం పట్టణ ప్రగతి పనుల కోసం రూ.91.25లక్షలు జగిత్యాల మున్సిపాలిటీకి విడుదల చేసింది. ముఖ్యంగా విలీన ప్రాంతాలైన టీఆర్‌నగర్‌, లింగంపేట, శంకులపల్లె, గోవిందుపల్లె అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. సుమారు 350 ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. పట్టణంలో పాత బల్బుల స్థానంలో 300 కొత్త బల్బులు వేశారు. లూజ్‌ వైర్లను సరిచేశారు. తుప్పు పట్టిన స్తంభాలను తొలగించి కొత్తవి వేశారు. తుప్పు పట్టిన ఇనుప పోల్స్‌ 24, విరిగిన పోల్స్‌ 152, రోడ్డు మధ్యలో ఉన్నవి 5, లూజ్‌ వైర్ల మధ్య వేసినవి 117 సరిచేసి మొత్తం 298 స్తంభాలు వేశారు.  5వేల మొక్కలు నాటాలని నిర్ణయించి ఎండల నేపథ్యంలో వెయ్యి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు. పట్టణంలో 3000 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. రాంబజార్‌ సత్రం ఎదుట మూత్రశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పార్కు, కొత్త బస్టాండ్‌ ఆటో స్టాండ్‌ వద్ద పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి స్థలం సేకరించారు. 800 ఖాళీ స్థలాల్లో ముళ్ల పొదలున్నట్లు గుర్తించి, 500 స్థలాల్లో పూర్తి స్థాయిలో తొలగించినట్లు  మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌ కుమార్‌ తెలిపారు. 


25ఏండ్లకు పరిష్కారం

25 ఏండ్లుగా పరిష్కారం కాని మాదిగ కుం ట సమస్యకు పట్టణ ప్రగతి ద్వారా పరిష్కారం లభించింది. కుంటను ఆనుకొని ఎట్ల జీవిస్తున్న మో అది మాకే తెలుసు. ఓ పక్క కుంట, ఇంటి ముందు ఉండే పబ్లిక్‌ టాయిలెట్లతో తీవ్ర దుర్వాసన వచ్చేది. ఊపిరి పీల్చుకుందామన్నా కష్టమయ్యేది. రోజూ ముక్కు మూసుకొని బయటకు వెళ్లేటోళ్లం. దిక్కుమండ్ల కుంటతోని అందరికీ రోగాలచ్చేది. దాన్ని బాగుచేయాల్నని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ఇటువైపు చూడలే. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం మా బాధలను తొలగించింది. కుంటను శుభ్రం చేసి, దానికి గండి కొట్టి మురుగును బయటకు పంపింన్రు. కుంటు చుట్టూ కంచె వేసిన్రు. మొక్కలు పెట్టి ఎవరూ చెత్తవేయకుండ జేసిన్రు. ఇన్నిరోజులకు మాకు ప్రశాంత వాతావరణం దొరికింది. -మోర విజయలక్ష్మీ, రాయికల్‌


 కోరుట్లలో..

కోరుట్ల పట్టణంలోని 33 వార్డుల్లో ప్రతి వార్డుకు 30 మంది కమిటీ సభ్యులు, ప్రత్యేకాధికారిని నియమించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 54 కరెంట్‌ పోల్‌ను మార్చారు. 41 చోట్ల తీగలు సవరించారు. తుప్పుపట్టిన ఇనుప స్తంభాలు 45, చెడిపోయిన స్తంభాలు 346, లైజ్‌లైన్ల మధ్య 137 స్తంభాలు కావాలని గుర్తించారు. 10 లూజ్‌ వైర్‌ కనెక్షన్లను సరిచేశారు. రెండు ట్రాన్స్‌పార్మర్ల మార్పు కోసం స్థలాలను పరిశీలిస్తున్నారు. గృహాలను అనుకొని 311 ఖాళీ ప్లాట్లు గుర్తించి వాటిలో చెత్తను తొలగించారు. 33,951 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మురుగు కాల్వల వెంట పారిశుధ్య పనులు చేశారు. విరిగి పోయిన, వంగిన, తుప్పుపట్టిన పోల్స్‌ స్థానంలో కొత్తవి వేశారు. 


 రాయికల్‌లో..

రాయికల్‌ మున్సిపాలిటీలో 33.17 కిలోమీటర్లమేర ప్రధాన, 7.7కిలో మీటర్ల బీటీ రోడ్లు, 23.1కిలోమీటర్ల మేర కచ్చరోడ్లను శుభ్రం చేశారు. 40 కిలోమీటర్ల మేర  సీసీ, కచ్చా డ్రైనేజీల్లో మురుగు తొలగించారు. 6,139 ఖాళీ స్థలాలను శుభ్రం చేశారు. 19 ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేశారు. 72 అపరిశుభ్ర, మురుగు ప్రాంతాలను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. 30,500 స్కేర్‌ మీటర్లలో రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించారు. శ్మశాన వాటికలను శుభ్రం చేశారు. 29 వంగిన విద్యుత్‌ స్తంభాలను గుర్తించి 17 కొత్తవి వేశారు. శిథిలావస్థలకు చేరిన  స్తంభాలను గుర్తించి 55 కొత్తవి అమర్చారు. రోడ్ల మధ్య ప్రమాదకరంగా ఉన్న 8స్తంభాలను తొలగించారు. 48 ప్రాంతాల్లో లూజ్‌ వైర్లను సరిచేశారు. 


logo