గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Mar 07, 2020 , 01:06:08

ఐదు రోజుల్లో ఇంటింటికీ భగీరథ నీరు

ఐదు రోజుల్లో ఇంటింటికీ భగీరథ నీరు

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల మున్సిపల్‌ పరిధిలోని టీ ఆర్‌నగర్‌ గ్రామానికి ఐదు రోజుల్లో మిషన్‌ భగీరథ నీరు వస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. టీఆర్‌నగర్‌లోని మూడు వాటర్‌ ట్యాంకులను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నీరు టీఆర్‌నగర్‌ వాసులకు ఇంటింటికీ అందాలని, అసంపూర్తిగా ఉన్న నల్లా కనెక్షన్లను త్వరగా పూర్తి చేసి శుద్ధమైన తాగునీరు అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రామారావు, మున్సిపల్‌ డీఈ లచ్చిరెడ్డికి సూచించారు. అనంతరం క్లోరినేషన్‌ విధానంపై సంబంధిత పంపు ఆపరేటర్‌ను వివరాలు అడగగా సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరుండి క్లోరినేషన్‌ విధానాన్ని పరిశీలించారు. స్వచ్ఛమైన తాగునీరు అందాలనే ఉద్దేశంతో చేపట్టిన గొప్ప పథకం మిషన్‌ భగీరథ అని, త్వరలోనే టీఆర్‌నగర్‌ వాసులకు శుద్ధ్దజలాలను ఇంటింటికీ అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ షేక్‌ చాంద్‌పాషా, మాజీ సర్పంచ్‌ కొండ శ్రీను, నాయకులు రాజ్‌కుమార్‌, సార య్య, సుమన్‌, విక్రమ్‌ పాల్గొన్నారు. 


logo