శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Mar 07, 2020 , 01:00:51

కరోనా వైరస్‌పై అవగాహన సదస్సులు

కరోనా వైరస్‌పై అవగాహన సదస్సులు

జగిత్యాల లీగల్‌ : జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైఫ్‌ సైన్సెస్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా వైరస్‌పై అవగాహన సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ శ్రీపతి మాట్లాడుతూ కరోనా వైరస్‌ ముఖ్యంగా కరచాలనం, ద గ్గు, తుమ్ముల వల్ల వ్యాప్తి చెందుతుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుంపర్లలోని వైరస్‌ మెటల్‌ వస్తువులపై సుమారుగా 12గంటలు, బట్టలపై 8గంటలు, చేతులపై 10నిమిషాలు బతికుంటుందన్నారు. ఈలోపు ఎవరైనా వ్యక్తులు వాటిని తాకి నా వారి చేతుల ద్వారా గానీ నోటి ద్వారా గానీ, ముక్కు, గొంతు ద్వారా గానీ  వ్యాపిస్తుందని తెలిపారు. దీని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా సంక్రమణను అరికట్టవచ్చన్నారు. ఇప్పటివరకు ఈ మరణాల రేటు 0.1శాతం మాత్రమేనన్నారు. ప్రధానంగా వృద్ధులు, తరచుగా జబ్బుతో బాధపడేవారు, చేతులను ముఖం వద్దకు తక్కువగా తీసుకురావడం, జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం, మాస్కులు ధరించడం వల్ల వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. జిల్లా ప్రధాన  దవాఖానలో ప్రత్యేకమైన ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ అశోక్‌, డాక్టర్‌ నరేందర్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ భూమేశ్వర్‌, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

జగిత్యాల టవర్‌ సర్కిల్‌ :  జిల్లా కంద్రంలోని జవహర్‌ విద్యా మందిర్‌ పాఠశాలలో రాష్ట్ర పీఎంపీ శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీని దవాఖాన వైద్యుడు డాక్టర్‌ వేణుబాబు మా ట్లాడుతూ కరోనా వైరస్‌ లక్షణాలు - నివారణ చర్యల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ‘షేక్‌ హ్యాండ్‌ వద్దు, నమస్కారం ముద్దు’ అని వివరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్రం పీఎంపీ అధ్యక్షుడు డాక్టర్‌ రాజగోపాల చారి పాఠశాల చైర్మన్‌ జగన్‌ మోహన్‌ రావు, గాయత్రి పరివార్‌ సభ్యులు లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి గోపాల్‌ రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

సారంగాపూర్‌ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయంలో శుక్రవారం సర్పంచ్‌ గుర్రాల రాజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిదులతో కరోన వైరస్‌పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.   సందర్భంగా సర్పంచ్‌ గుర్రాల రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రా మంలో గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతు కరోనా వైరస్‌ సోకకుండా ముందస్తు చర్యలపై అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్‌, ఉప సర్పంచ్‌ గంగారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo