మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Mar 06, 2020 , 03:12:44

మద్దతు ధర ఇవ్వాలి

మద్దతు ధర ఇవ్వాలి

జగిత్యాల టౌన్‌ : పసుపు పంటకు మద్దతు ధర, బోనస్‌ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ‘జిల్లా రైతు ఐక్య వేదిక’ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్‌ నుంచి కొత్త బ స్టాండ్‌ వరకు 400 మంది రైతులు గురువారం భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాల యం ఎదుట ధర్నా చేసి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మా ట్లాడుతూ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నామని, ఎకరంలో పసుపు సాగు చేయాలంటే రూ. లక్ష నుంచి రూ.లక్షాఇరవై వేల దాకా ఖర్చు వస్తుందని తెలిపారు. మార్కెట్‌ యార్డులో ఎకరా పంట దిగుబడికి రూ.50వేల నుంచి రూ.80 వేలు మాత్ర మే ధర వస్తున్నదనీ, ఎకరా పసుపు పంటపై రూ.30వేల దాకా నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తాయని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఇప్పుడు ఏమాత్రం ప్రయోజనం లేని సుంగధ ద్రవ్యాల బోర్డును తెరపైకి తెచ్చారని, పసుపు బోర్డుపై బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మాట మార్చిన ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీగా అర్వింద్‌ గెలిచినప్పటి నుంచీ ఇప్పటి వరకు పసుపు బోర్డు గురించి పార్లమెంటులో ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.15వేలు మద్దతు ధర ప్రకటించి పసుపు రైతులను ఆదుకోవాలనీ లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకోతో జగిత్యాల-కరీంనగర్‌ ప్రధా న రహదారిపై వాహనాలు నిలిచిపోయి రెండు గంటల పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనంతరం కలెక్టర్‌ ఏవో నలువాల వెంకటేశ్‌కు రైతులు వినతి పత్రం అందించి ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు పన్నా ల తిరుపతిరెడ్డి, ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు జే లింగారెడ్డి, బీ దేవరా జం, పొట్టాల మోహన్‌రెడ్డి, గడ్డం సత్యనారాయణరెడ్డి, ఏలేటి నారాయణరెడ్డి, ఒగులపు వెంకట్రాజం, జిల్లాలోని ప సుపు రైతులతో పాటు నిజామాబాద్‌, ఆర్మూర్‌కు చెందిన రైతులున్నారు.


logo
>>>>>>