శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Mar 05, 2020 , 02:26:50

ఏప్రిల్‌ 1న వెట్న్‌

ఏప్రిల్‌ 1న వెట్న్‌

మల్యాల:  ఏప్రిల్‌ 1న పోతారం రిజర్వాయర్‌ వెట్‌ రన్‌ నిర్వహిస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. బుధవారం కొడిమ్యాల మండలంలోని పోతారం రిజర్వాయర్‌లో నీటి ఎత్తిపోతల కోసం ఏర్పాటు చేసిన రెండు మోటార్లను ఆయన   సంబంధిత అధికారులతో కలిసి డ్రైరన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొడిమ్యాల మండలంలోని మైసమ్మ చెరువుకు వారం రోజులుగా రెండు పంపుల ద్వారా ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోస్తున్నారన్నారు. మైసమ్మ చెరు వు జలకళను సంతరించుకోవడంతో పాటు మైస మ్మ చెరువుకు అనుసంధానంగా ఉన్న పోతారం రిజర్వాయర్‌లో గల పంపులకు డ్రైరన్‌ కార్యక్రమా న్ని నిర్వహించామన్నారు. సాధ్యమైనంత మేరకు ఏప్రిల్‌ 1వ తేదీలోగా వెట్న్‌ నిర్వహించడంతో పాటు కొడిమ్యాల మండలంలోని శ్యామల చెరువుకు  గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి నీటిని అందజేస్తామని తెలిపారు. 


పోతారం రిజర్వాయర్‌ ప్రారంభమైతే వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల్లోని పలు మండలాలకు ఎల్లంపల్లి జలాలు అందడంతో పాటు కరువు ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామాలు పూర్తిస్థాయిలో సస్యశ్యామలంగా మారనున్నాయన్నారు. డీ1, డి2 డిస్ట్రిబ్యూటరీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి నీటిని అందజేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు.  పోతారం రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో వెట్న్‌ నిర్వహిస్తే 3వేల ఎకరాల్లో సాగునీరు అందడం ద్వారా ఈ ప్రాంత భూ గర్భ జలాలు పెరుగుతా యన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, కొడిమ్యాల సహకార సంఘం అధ్యక్షుడు మెన్నేని రాజనర్సింగా రావు, వైస్‌ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్‌, నాయకులు పులి వెంకటేశ్‌ గౌడ్‌, రమేశ్‌, స్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. logo