ఆదివారం 24 మే 2020
Jagityal - Mar 05, 2020 , 02:23:41

తొలిరోజు ప్రశాంతం

తొలిరోజు ప్రశాంతం

జగిత్యాల లీగల్‌ : జిల్లాలో ఇంటర్మీయెట్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, హిందీ, సంస్కృతం, అరబిక్‌, ఫ్రెంచ్‌ సబ్జెక్టు పరీక్షలకు 9,502మంది విద్యార్థులకు గానూ 8,933మంది (94శాతం) హాజరయ్యారనీ, 569మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియెట్‌ విద్య జిల్లా నోడల్‌ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తం గా 28పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు  మౌలిక వసతులు కల్పించామన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఆయనవెంట నోడల్‌ అధికారి బొప్పరాతి నారాయణ, చీఫ్‌ సూపరింటెండెంట్‌ శ్రీవాణి తదితరులున్నారు.  


logo