శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Mar 04, 2020 , 02:56:36

సర్వాంగ సుందరంగా జగిత్యాల

సర్వాంగ సుందరంగా జగిత్యాల
  • పట్టణ ప్రగతికి రూ.91లక్షలు
  • మురుగు కాలువల్లో చెత్త వేయవద్దు
  • నిరక్షరాస్యుల్ని గుర్తించేందుకు ఇంటింటి సర్వే
  • ఎమ్మెల్యే సంజయ్‌
  • 36వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు
  • పాల్గొన్న కలెక్టర్‌ రవి

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సర్వాం గ సుందరంగా జగిత్యాలను అభివృద్ధి చేసేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సంజ య్‌కుమార్‌ పిలుపునిచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రగతిలో భాగంగా 36 వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్‌, కలెక్టర్‌ జీ రవి, మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రా వణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. వా ర్డుల్లో 4 కమిటీలను అదే వార్డు ప్రజలతో ఏర్పా టు చేసి, స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకు ని సమస్యను పరిష్కరించేందుకు కావాల్సిన నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పట్టణ ప్రగతిలో పది రోజుల్లో సమస్యలను గుర్తిం చి, తాత్కాలికమైన సమస్యలు పరిష్కరించి మిగిలిన వాటికి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.91లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రతి ఇంటికీ స్థలాన్ని బట్టి మొక్కలు నాటాలన్నా రు. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో ఉండాలని, ప్రతి గ్రామానికి, పట్టణానికి నర్సరీ ఏర్పాటు చే యాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రతి వారు ప్రతి పనిలో భాగస్వాములైన నాడు అభివృద్ధి చెం దుతాయన్నారు. ప్రభుత్వ పరంగా సీసీ కెమెరా లు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసేందుకు రూ. కోటి నిధులు మంజూరైనట్లు తెలిపారు. సంపద పెంచు, పేదలకు పంచు అనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. 


మున్సిపాలిటీల్లోని వీధుల్లో చిన్న చిన్న రోడ్లు ఉ న్నాయని, ప్రస్తుతం నిర్మించే భవనాల్లో కొంత స్థ లాన్ని ఇంటి ముందు వదిలి నిర్మించుకోవాలన్నా రు. కలెక్టర్‌ జీ రవి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీలోని 48 వా ర్డుల్లో ప్రజలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమా లు నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ ప్రగతిలో ప్రతి  వార్డుల్లోని ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు తొలగించుతున్నారన్నారు. పట్టణాల్లోని హోటళ్లు, హాస్టళ్లు, ఇళ్లల్లో మిగిలిన ఆహార పదార్థాలు, కూరగాయాలను రోడ్డు మీద, డ్రైనేజీల్లో వేయడం వల్ల పందుల బెడద అధికంగా ఉందన్నారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు ఇస్తున్నారని, ఇంటిలోని తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా చేసి మున్సిపాలిటీ చెత్త బండ్లకు అందించాలన్నారు. ఎవరైనా డ్రైనేజీల్లో, రోడ్లపై చెత్త వేస్తే వారిపై నిఘా పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. నిరక్షరాస్యత గుర్తించేందుకు ఇంటింటికీ సర్వే నిర్వహి స్తారని, దీంతో పాటు ఇంటి అవసరాల కోసం ఒక్కొక్క ఇంటికి ఎన్ని మొక్కలు కావాలని కూడా సర్వే చేస్తున్నారని, సర్వే ప్రకారంగా ప్రతి ఇంటికి జూన్‌, జూలై నెలల్లో మొక్కల పంపిణీ చేస్తామన్నా రు. 36వ వార్డులో సీసీ కెమెరాలు ఏరాపటుచేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ము న్సిపల్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ బోగ శ్రావణి మాట్లాడుతూ పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతూ, ప్రజలను భాగస్వాములను చేస్తున్నా రన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు నివారించవచ్చని, మ హిళలకు భద్రత కల్పించినవారమవుతామన్నారు.    సీసీ కెమెరాల దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ జయంత్‌ రెడ్డి, తాసిల్దార్‌ వెంకటేశ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, వార్డు కౌన్సిలర్‌ ఆడువాల జ్యోతి, నాయకులు ఆడువాల లక్ష్మణ్‌, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. logo