మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Mar 02, 2020 , 01:39:34

అక్రమ లే అవుట్లపై కొరడా

అక్రమ లే అవుట్లపై కొరడా

మెట్‌పల్లిటౌన్‌: అక్రమ లే అవుట్లపై మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఆదివారం పట్టణంలోని వెంకట్రావుపేట, ఆరపేట శివార్లలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను గుర్తించి  ఇండ్ల స్థలాలకు రియల్టర్లు పాతిన హద్దురాళ్లను తొలగించారు. లే అవుట్‌ అనుమతి తీసుకోవడంతో  నిర్ణీత కొలతల ప్రకారం అంతర్గతరోడ్లు వేయాల్సి ఉంటుం ది. విద్యుత్‌ స్తంభాలు, డ్రైనేజీలను నిర్మించాలి. 10 శాతం స్థలాన్ని మున్సిపాలిటీకి స్వాధీనం చేయాల్సిన ఉంటుంది. కాగా, ఈ నిబంధనలు పాటిస్తే  ఆర్థికంగా ఎక్కువగా ప్రయోజనం కలిసిరాదనే దురాలోచనతో ఇష్టారాజ్యంగా  అక్రమ లే అవుట్లతో  రియల్టర్లు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.  దీంతో ఆయా వెంచర్లలో కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు రావడమే కాకుండా మున్సిపల్‌ ఆదాయానికి గండి పడుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపల్‌ అధికారులు అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మునిపాలిటీలో విలీనమైన వెంకట్రావుపేట, ఆరపేట పరిధిలో ఇటీవల అక్రమ లేఅవుట్లతో ఇండ్ల స్థలాల వి క్రయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో స్పందించి న  మున్సిపల్‌ అధికారులు  తమ సిబ్బందితో  ఆయా వెంచర్లలో హద్దు రాళ్లను తొలగించారు. మున్సిపల్‌ అధికారులు  అక్రమ లే అవుట్లపై కొరడా ఝులిపిస్తుండడంతో రియల్టర్ల గుండెల్లో గుబులు మొదలైంది.logo
>>>>>>