శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Mar 02, 2020 , 01:37:51

కలిసికట్టుగా పనిచేయాలి

కలిసికట్టుగా పనిచేయాలి

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  అధికారు లు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాల ని కలెక్టర్‌ రవి సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల మున్సిపల్‌ పరిధిలోని 18వ వార్డులో జరుగుతున్న పనులను కలెక్టర్‌ జీ రవి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. 18వ వార్డులోని ఎడ్ల అంగడి ప్రాంతంలో నిర్వ హిస్తున్న పట్టణ ప్రగతి పనులను కలెక్టర్‌ పర్యవేక్షించారు. ఎడ్ల అంగడి ప్రాంతం, కాలనీలో పిచ్చి మొక్కలను తొలగించడం, రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీని శుభ్రపరుచడం వంటి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ల్లాలన్నారు. వార్డు  ప్ర జలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ వార్డులో ఉన్న సమస్యల్లో తాత్కాలికంగా సాధ్యమయ్యే పనులను వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు.  మిగిలిన పనులను అధికారులు నమోదు చేసకొని సంబంధిత పనులకు శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలోని వార్డుల్లో మెప్మా సిబ్బంది ఇంటిం టా సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించి రిజస్టరులో నమోదు చేయాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించడంతో పాటు ప్రతి ఇంటిలో మొ క్కలు నాటేందకు ఉన్న స్థలాన్ని గుర్తించి తదనుగుణంగా నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి జూన్‌లో మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.  జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌రెడ్డి, పట్టణ ప్రగతి సూపరవైజర్‌ అధికారి కల్పన, ప్రత్యేకాధికారి దేవేందర్‌, కౌన్సిలర్‌  చుక్క నవీన్‌, డీఈ లచ్చిరెడ్డి, మెప్మా సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

‘పట్టణ ప్రగతి’లో వేగం మరింత పెంచాలి

ధర్మపురి,నమస్తేతెలంగాణ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో వేగం పెంచాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. ధర్మపురి పట్టణంలో జరిగే పట్టణ ప్రగతి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నంది చౌక్‌ నుంచి  ల క్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం అక్కడ నుంచి గోదావరి వీఐపీ ఘాట్‌, మంగళి గడ్డ, హోటల్‌ హరిత, బోయవాడల్లో కాలి నడకన కలియ తిరిగారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను పరిశీలించారు. పట్టణ ప్రగతి పనుల్లో మరింత వేగం పెంచాల్సినవసరం ఉందన్నారు. పారిశుధ్య సి బ్బంది వివరాలు తెలుసుకున్నారు. మున్నిపల్‌ సిబ్బంది 45 మంది ఉండగా, 56 మందిని ప్రైవేటుగా నియమించుకున్నామని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. పారిశుధ్య పనుల్లో వేగం పెంచాలని, అవసరమైతే  మరికొంత మందిని ప్రైవేటుగా నియమించుకోవాలన్నారు. ప్రధానంగా పట్టణం లో అక్రమ లే అవుట్లను గుర్తించాలన్నారు. పట్టణంలోని ప్రతీ వీది, ప్రతీ మురుగుకాలువ శుభ్రం చేయాలన్నారు. వీదులల్లో పెరిగిన పొదలు, చెత్తాచెదారాన్ని తొలగింపజేయాలన్నారు. అధికారులు   ఇంటింటా తిరిగి నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు.  మిషన్‌ భగీరథ పనులు పూర్తికాని ప్రదేశంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రధానంగా రానున్న వేసివిలో నీటి ఎద్దడిని అధిగమించేలా చర్యలు చేపట్టాలన్నారు. మిషన్‌ భగీరథ నీరు స మయానికి అందకున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చూసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మెలిగి విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, ము న్సిపల్‌ కమిషనర్‌ దివ్యదర్శన్‌రావ్‌, వైస్‌ చైర్మన్‌ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు అయ్యోరి వేణు, జక్కు పద్మ, వేముల నాగలక్ష్మి, సంగనబట్ల సంతోషి తదితరులున్నారు.


logo