సోమవారం 30 మార్చి 2020
Jagityal - Mar 02, 2020 , 01:10:20

‘చేయూత’కు అరుదైన గౌరవం

‘చేయూత’కు అరుదైన గౌరవం

కోరుట్లటౌన్‌: సామాజిక సేవా విభాగంలో కోరుట్లకు చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థకు అరుదైన గౌరవం దక్కింది. సంస్థ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్‌ రాయల్‌ సక్సెస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సంస్థ విజన్‌-2020 అవార్డును అందజేసి సత్కరించింది. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, నేత్ర, దేహదానం తదితర పేవా కార్యక్రమాలను గుర్తించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌ ప్లాటినం బిజినెస్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా విజన్‌-2020 అవార్డును చేయూత ప్రతినిధులు కటుకం గణేశ్‌, ఎండీ అతిక్‌, జాల వినోద్‌కుమార్‌, ఎండీ సనావొద్దీన్‌, జిందం లక్ష్మీనారాయణ స్వీకరించారు.   

ధట్నూర్‌ ఉపాధ్యాయుడికీ అవార్డు

గొల్లపల్లి: హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌ ప్లాటి నం హోటల్‌లో రాయల్‌ సక్సెస్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సంస్థ మండలంలోని ధట్నూర్‌ గ్రామ ఎంపీయూపీఎస్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జూపాక సుదర్శన్‌కు అవార్డును ప్రదానం చేసింది. సుదర్శన్‌ సొంత ఖర్చులతో హరితహారంలో చురుగ్గా పాల్గొని 1200మొక్కలు నాటి సంరక్షణకు నీళ్లు పట్టారు. 100 ట్రీ గార్డులు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థం కావడానికి బోధనోపకరణాలను తయారు చేసి బోధిస్తున్నారు. ఇతడి సేవలను గుర్తించిన సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ హారిక, తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ బాస ప్రకాశ్‌ తదితరులున్నారు. 

ఇద్దరు మల్యాల వాసులకూ...

మల్యాల: వివిధ రంగాల్లో రాణిస్తున్న మల్యాల మండల వాసుల ప్రతిభను గురించిన రాయల్‌ సక్సెస్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేసింది. మల్యాల మండలానికి చెందిన పొన్నంబక్కుల శ్రీనివాస్‌ గౌడ్‌ వివిధ దేశాల కరెన్సీ నాణేలతో తెలంగాణ పటం రూపొందించగా, కస్తూరి ప్రసాద్‌ 1.5 వోల్టుల బ్యాటరీ సామర్థ్ంయతో నడిచే అతి బుల్లి ఫ్యాన్‌ను తయారు చేశాడు. వీరి ప్రతిభను గుర్తించిన రాయల్‌ సక్సెస్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ అవార్డులకు ఎంపిక చేసింది. కాగా సంస్థ అధినేత అధినేత జయవరపు వెంకటేశ్వర్లు అవార్డులను అందజేశారు. వీరిని మల్యాల వాసులు అభినందించారు.  


logo