సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Mar 01, 2020 , 02:29:03

నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి

నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి

ధర్మపురి రూరల్‌ : ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన ముగ్గురికి రూ.1.05లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. పట్టల శంకరయ్యకు రూ.60వేలు, జీ.మల్లయ్యకు రూ.25వేలు, గటికె లింగవ్వకు రూ.20వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యవసర చికిత్స కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులు చెల్లిస్తుందని చెప్పారు. అలాగే ముందుగా దవాఖాన ఖర్చు లు చెల్లించుకోలేని వారికి ఎల్‌ఓసీలు అందజేస్తున్నట్లు వివరించారు. అనా రోగ్యంతో బాధపడుతున్న వారు ఖర్చుల కోసం దరఖాస్తులు అందిస్తే, సహాయం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


logo