సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Feb 29, 2020 , 00:22:27

సమష్టి కృషితోనే అభివృద్ధి

సమష్టి కృషితోనే అభివృద్ధి

జగిత్యాల/మెట్‌పల్లి నమస్తే తెలంగాణ/కోరుట్లటౌన్‌ : సమష్టిగా కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందనీ, పట్టణ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. జగిత్యాల, కో రుట్ల, మెట్‌పల్లిలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసం త, ఎమ్మెల్యేలు సంజయ్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కలెక్టర్‌ రవి, మున్సిపల్‌ అధ్యక్షులతో కలి సి శుక్రవారం పట్టణ ప్రగతి సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా జగిత్యాల 23 వ వార్డులోని ధర్మశాల వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఒక్కొక్కటిగా ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోనే విద్యుత్‌ సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో పలు నదులు పారుతున్నా సరైన ప్రాంతాల్లో ప్రాజెక్టులు లేక నీటి కోసం సతమతమయ్యేవారమని గుర్తు చేశారు. శాశ్వత పరిష్కారం కోసం కాళేశ్వరం ప్రా జెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేసి, రాష్ట్రమం తా సస్యశ్యామలమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్సారెస్పీని నింపేందుకు పునర్జీవం, వరదకాలువకు ఓటీలతో చెరువులకు నీటిని మ ల్లింపు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో పల్లె ప్రగతి నిర్వహించి అభివృద్ధి బాటలోకి తెచ్చామనీ, మున్సిపాలిటీలను కూడా ప్రగతి బాట పట్టిస్తామని పేర్కొన్నారు. 


మన వార్డు, మన పట్టణం అభివృద్ధి బాధ్యత పట్టణ ప్రజలందరిపై ఉందనీ, అధికారులు, ప్రజాప్రతినిధులంతా భాగస్వాములై పట్టణాల అభివృద్ధి కో సం కృషి చేయాలని కోరారు.  ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీ అనేక ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్నద నీ, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జిల్లాకు జగిత్యాల కేంద్రం గుండెకాయ లాంటిద నీ, దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధుల కో సం మంత్రి ఈశ్వర్‌ చొరవ తీసుకోవాలని కోరా రు. డీసీఎంఎస్‌ రైస్‌మిల్లు శిథిలావస్థకు చేరుకుందనీ, ఇక్కడ కమ్యూనిటీ హాల్‌ ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలో మంచి నీటి పైప్‌లైన్‌ను మార్చాలనీ, ధరూర్‌క్యాంప్‌లోని సీ టైప్‌ గృహాల కు మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.  జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ పట్టణాల్లో మొక్కలు నాటి ఉష్ణోగ్రతను తగ్గించే దిశగా చర్య లు తీసుకోవాలనీ, ప్రతి ఇంటి ఆవరణలో తప్పని సరిగా ఆరు మొక్కలు నాటుకోవాలని సూచించారు.


 మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా విద్యుత్‌, పారిశుధ్య స మస్యలనే దృష్టికి తెస్తున్నారని వీటిని పరిష్కరించేందుకు అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తిస్తున్నామనీ, జిల్లాలో ఇప్పటి వరకు 6వేల మందిని గుర్తించామని, జగిత్యాల మున్సిపాలిటీలో 2400 మందిని గుర్తించామని వెల్లడించారు. పట్టణ ప్రగతి కోసం జిల్లాకు రూ.2.29 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఐదు మున్సిపాలిటీలకు 64 స్వచ్ఛ ఆటోలను కూడా కొనుగోలు చేశామని, వాటిని అన్ని మున్సిపాలిటీలకు అందజేస్తామన్నారు. ఇక్కడ ఆదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, జగిత్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌ కుమార్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్‌ జుంబర్తి రాజ్‌కుమార్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 


ప్రణాళికా బద్ధంగా సమస్యల పరిష్కారం

మెట్‌పల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణ లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమావేశంలో  మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా క్రమపద్ధతిలో సమస్యలు పరిష్కరించామనీ, ఇప్పుడు కూడా ప్రణాళికాబద్ధంగా పట్టణాల్లో స మస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్ర మం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. హై దరాబాద్‌ ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదనీ, రాష్ట్రంలోని అన్ని ముఖ్య నగరాలు,  మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలన్నదే  ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెట్‌పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నెలకు రూ.45.58లక్షల నిధులు వస్తున్నట్లు మంత్రి  తె లిపారు. మిషన్‌ భగీరథ  ద్వారా ప్రతి ఇంటికీ తా గునీరందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందనీ, ఇప్పటికే మిషన్‌ భగీరథ పను లు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. ఎమ్మెల్యే క ల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ పట్టణ ప్రగతితో పట్టణాల రూపు రేఖలు మారనున్నాయ నీ, మున్సిపల్‌  పాలకవర్గ సభ్యులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కో రారు. కలెక్టర్‌ రవి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రా ముఖ్యతను వివరించారు. అంతకు ముందు వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట  మంత్రి కొ ప్పుల, ఎమ్మెల్యే  కల్వకుంట్ల మొక్కలు నాటారు.  ఇక్కడ అదనపు కలెక్టర్‌ రాజేశం, మున్సిపల్‌ అధ్యక్షురాలు రాణవేని సుజాత,  ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ, తాసిల్దార్‌ రాజేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


సత్వర పరిష్కారానికే ‘ప్రగతి’

 పట్టణాల్లో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని సమస్యల సత్వర పరిష్కారానికే పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈశ్వర్‌ పేర్కొన్నారు. కోరుట్ల మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్లతో కలిసి పాల్గొన్నారు. మంత్రికి కమిషనర్‌ ఆయాజ్‌ మొక్కను బహుమతిగా అందజేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఐదేళ్ల పాలనలో ఎన్నో వినూత్నమై న పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో సత్ఫలితా లు పొందామనీ, వాటి స్ఫూర్తిగా పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేసి ప్రగతి దిశగా అడుగులు వేద్దామన్నారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత అనీ, ప్రతి ఒక్కరూ పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం కోరుట్ల ము న్సిపాలిటీకి మంజూరైన 21 స్వచ్ఛ వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మున్సిపల్‌  ఆధ్వర్యంలో జూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు.మైనార్టీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం ద్వారా 18 మందికి మంజూరైన రూ.14.40లక్షల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. 


ఆరు బయట చెత్త వేస్తే కేసులు  

 చెత్తను ఆరు బయట పారబోస్తే క్రిమినల్‌ కేసు లు నమోదు చేస్తామని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయణించాలనే సంకల్పంతో ప్రభుత్వం పట్టణ ప్రగతికి రూపకల్పన చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేలా వార్డు కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. పట్టణంలో 14 ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ఉన్న స్థలాలను గుర్తించామనీ, వ్యర్థాలను ఇష్టారీతిలో ఆరు బ యట వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నివాస ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లలో చెత్తను వేస్తే యజమానులకు జరిమానా విధిస్తామన్నారు. నిరక్షరాస్యుల గుర్తింపు కోసం మెప్మా ఆర్పీలు సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ని ఐదు మున్సిపాలిటీల్లో కోరుట్ల ప్రణాళికాబద్ధం గా ముందుకు సాగుతున్నదని కితాబునిచ్చారు. 


నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతాం : కల్వకుంట్ల

కోరుట్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి కోసం మంజూరై. రూ.50 కోట్ల ప్రత్యేక నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 88 వేల పింఛన్లు అందుకుంటున్న నియోజకవర్గంగా కోరు ట్ల నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ప్రవేశపెట్టిన ప్రగతి కార్యక్రమం ద్వారా ఎన్నో ఏళ్లుగా పేరుకు పోయిన సమస్యలకు పరిష్కారం దక్కనుందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక్కడ అదనపు కలెక్టర్‌ రాజేశం, మున్సిపల్‌ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త చీటి వెంకటరావు, ఎంపీపీ తోట నారాయణ, తాసిల్దార్‌ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మెప్మా ఆర్పీలు, మహిళ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.


logo