సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Feb 27, 2020 , 00:40:33

పేదలు ఆత్మగౌరవంతో బతకాలి

పేదలు ఆత్మగౌరవంతో బతకాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ : పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల అర్బన్‌ మండలంలోని నూకపెల్లిలో 360 రెండు పడకగదుల ఇండ్ల సముదాయానికి బుధవారం జగిత్యాల శాసన సభ్యులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ కు మార్‌ మాట్లాడుతూ జగిత్యాల పట్టణ పేద ప్రజల అభివృద్ధి కోసం 360 రెండు పడకగదుల నిర్మా ణం రూ.19.08కోట్లతో చేపడుతున్నట్లు తెలిపా రు. ఇవి కాక ఎమ్మెల్యే కోటా కింద మరో వెయ్యి గృహాలను మంజూరు చేయిస్తానన్నారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న 160 రెండు పడక గదు ల నిర్మాణాల్లో మిగిలిన కొన్ని మౌలిక సదుపాయాలు లేవని, వాటిని పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ కళ పేదలు ఆత్మగౌరవంతో బతకాలని, కాయకష్టం చేసే నిరుపేదలు కంటినిండి నిద్రపోవాలనే ఉద్దేశంతో పేదల ఇంటి కల నెరవేర్చడానికి అన్ని మౌలిక వసతులతో కూడిన రెండు పడక గదుల ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకంలో లబ్ధి పొందిన వారిలో కుల, మత భేదా లు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండేలా లా టరీపై ఇళ్లను కేటాయిస్తామన్నారు. ప్రజలంతా పట్టణ ప్రగతిలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజ యం చేయాలన్నారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వ సంత మాట్లాడుతూ పేదల కల నెరవేరే విధంగా వారి ఆత్మరక్షణ కోసం అన్ని వసతులతో కూడిన రెండు పడకగదుల ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పల్లెలన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ము ఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ఈ కార్యక్రమం విజయవంతమైనందున ప ల్లెలతోపాటు పట్టణాలు కూడా బాగుండాలని ప ట్టణ ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టారని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై కార్యక్రమా న్ని విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ బోగ శ్రావణి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వమని, సీఎం పేదింటి వారి కల సాకారం చేసేందుకు రెం డు పడకగదుల నిర్మాణం చేపట్టారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం బడు గు బలహీన వర్గాలకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ప్రభుత్వమన్నారు. స్థానిక శా సన సభ్యుల కోటా కింద  360 గృహాలు మంజూరుచేయడం శుభ పరిణామమన్నారు. కలెక్టర్‌ జీ రవి గుగులోత్‌ మాట్లాడుతూ ఇక్కడే నిర్మించిన 160 రెండు పడకగదుల నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, అం దులో మిగిలిపోయిన చిన్న చిన్న పనులను వెంట నే పూర్తి చేయాల్సిందిగా ఇంజినీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, ఈఈపీఆర్‌ మనోహర్‌ రెడ్డి, డీ ఈ రాజేశం, మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌ రెడ్డి, జగిత్యాల అర్బన్‌ తాసిల్దార్‌ వెంకటేశ్‌, ఎంపీ పీ గంగారాం గౌడ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 


logo