బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Feb 27, 2020 , 00:37:17

ప్రతి ఒక్కరూ కలిసిరావాలి

ప్రతి ఒక్కరూ కలిసిరావాలి

కోరుట్ల: పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి  ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవి అన్నారు. బుధవారం పట్టణంలోని 1,7 వార్డుల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి పర్యటించారు. వార్డుల్లో మురుగుకాలువలు, అంతర్గత రహదారులను పరిశీలించారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, జనవాసాల మధ్య చెత్తాచెదారం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పది రోజులపాటు సాగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో వాడవాడలా, ఇంటింటా తిరుగుతూ సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ప్రణాళికను తయారు చేయాలని  అధికారులకు సూచించారు. నూతనంగా ఏర్పా టు చేసిన విద్యుత్‌ స్తంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి పారిశుధ్య సిబ్బందికి సహకరించాలన్నారు. రోడ్లపై గుంతలను పూడ్చాలని, పిచ్చిమొక్కలను తొలగించాలన్నారు. ఖాళీ స్థలా ల్లో మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని, మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిరక్షరాస్యతపై పకడ్బందీగా సర్వే చేయాలని, అక్షరాస్యత పెంపుదల కోసం ప్రతి ఒక్కరూ  బాధ్యత తీసుకోవాలన్నారు.  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. పట్టణాన్ని మరింతగా అభివృద్ధిలో ముందుకు నడిపించేందుకు పట్టణ ప్రగతి ఎంతో దోహదపడుతుందన్నా రు. అన్ని వార్డుల్లో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టి తేవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో  పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, దీనిని ప్రజలు చక్కగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీద పవన్‌, కమిషనర్‌ ఎండీ అయాజ్‌, తాసిల్దార్‌ సత్యనారాయణ, నాయబ్‌ తాసిల్దార్‌ వకీల్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు గుంటుక శ్రీనివాస్‌, సంగ మాలతి, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ చీటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>