గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 27, 2020 , 00:25:05

ఆహ్లాదకరంగా అర్బన్‌ పార్క్‌

ఆహ్లాదకరంగా అర్బన్‌ పార్క్‌

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ : ఆహ్లాదకరంగా అర్బన్‌ పార్క్‌ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు  కలెక్టర్‌ గుగులోత్‌ రవి పేర్కొన్నారు.  బుధవారం  మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపేట శివారులో అటవీ శాఖ ఆధ్వర్యం లో నిర్మిస్తున్న అర్బన్‌ పార్క్‌ పనులను ఐఎఫ్‌ఎస్‌ అధికారి (టీఎస్‌ సీసీఎల్‌ఎఫ్‌) రాందాబ్రియల్‌తో కలిసి పరిశీలించారు. 72 ఎకరాల అటవీ భూమి విస్తీర్ణంలో అర్బన్‌ పార్క్‌ను నిర్మిస్తున్నారు.  రూ. 1.72 కోట్ల వ్యయంతో చేపట్టిన పెన్సింగ్‌ పనులను పరిశీలించారు. పార్క్‌లో పిల్లలకు ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్‌ ట్రాక్‌,  పలు జాతుల పక్షులు, వాచ్‌టవర్‌, బోరుబావి, వాటర్‌ ట్యాంక్‌, యోగ షెడ్డు,  గ్రీనరీ, టేకు, ఇతరాత్ర మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు అటవీ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు.  త్వర గా పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా అందుబాటులో ఉండేలా అర్బన్‌ పార్క్‌ను రూపొందించాలని కలెక్టర్‌ సూచించారు.  ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ,  ఎఫ్‌ఆర్‌ఓ రాజేశ్వర్‌రావు, తదితరులు ఉన్నారు.
logo