బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Feb 27, 2020 , 00:22:03

సీసీ రోడ్డు నిర్మాణాలకు ఎంపీ భూమిపూజ

సీసీ రోడ్డు నిర్మాణాలకు ఎంపీ భూమిపూజ

కథలాపూర్‌: మండలంలోని తక్కళ్లపెల్లి, కథలాపూర్‌, దూలూర్‌, బొమ్మెన గ్రామాల్లో రూ.15 లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, వైస్‌ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచులు, ఎంపీటీసీలు, కంటె నీరజ, గసికంటి లత, మొలిగె లక్ష్మి, జిల్లా లక్ష్మి, దయ్య లక్ష్మీనర్సయ్య, పిడుగు లావణ్య, నాయకులు ఎడ్మల వినోద్‌రెడ్డి, కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, రాచమడుగు వెంకటేశ్వర్‌రావు, కంటె సత్యనారాయణ, గాంధారి శ్రీనివాస్‌, జలేందర్‌రెడ్డి, బద్రి సత్యం, మొలిగె శ్రీనివాస్‌, రవీందర్‌రెడ్డి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మేడిపల్లి: మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో రూ.4.28 లక్షల ఎంపీ నిధులతో,  తొంబర్‌రావుపేటలో రూ.4లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. అలాగే గోవిందారం గ్రామంలో రూ.2లక్షలతో నిర్మించే బస్‌షెల్టర్‌ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పల్లెప్రగతిలో భాగంగా గోవిందారం, తొంబర్‌రావుపేట గ్రామపంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లను,  మన్నెగూడెం ప్రాథమిక పాఠశాలలో సరస్వతీ విగ్రహాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయా గ్రామాల ప్రజలు ఎంపీకి వినతిపత్రాలు ఇచ్చారు. జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, ఎంపీపీ దొనకంటి ఉమాదేవి, సర్పంచులు దుంపేట లక్ష్మీనర్సయ్య, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, కరండ్ల మధుకర్‌, ద్యావనపెల్లి అభిలాశ్‌, మామిడి సత్తవ్వ, ఎంపీటీసీలు పన్నాల లావణ్య, మ్యాకల రాజు, తాసిల్దార్‌ రాజేశ్వర్‌, ఎంపీడీవో పద్మజ, మాజీ ఎంపీపీ పల్లి జమున, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి క్యాతం దశరథరెడ్డి, నాయకులు అన్నాడి జలపతిరెడ్డి, రాచర్ల రాజు, మామిడి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.        logo