ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Feb 26, 2020 , 03:32:22

రేండోరోజు ఉత్సవాంగ

 రేండోరోజు ఉత్సవాంగ

(జగిత్యాల బృందం, నమస్తే తెలంగాణ)తెలంగాణ ప్రభుత్వం పట్టణాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం రెండో రోజైన మంగళవారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. ప్రధానంగా ఆయా పట్టణాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాదయాత్రలు చేసి స్థానికంగా ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం నిర్వహణ, హరితహారం కింద మొక్కలు నాట డం, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, విద్యుత్‌ సమస్యల గుర్తింపు వంటి పనులు చేశారు. వైకుంఠధా మం, ఏకీకృత మార్కెట్‌, తదితర వాటి ఏర్పాటు కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.


 కలియదిరిగిన ప్రముఖులు

పట్టణ ప్రగతిలో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1,2,3,15,16 వార్డుల్లో పనులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి పరిశీలించారు. కార్యక్రమంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. పట్టణ ప్రజలంతా పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా స్వీకరించి ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. వార్డుల్లో మొదటి ప్రాధాన్యంగా పాడైన స్తంభాలను తొలగించి కొత్తవి అమరుస్తున్నామన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని 10, 20 వార్డుల్లో కలెక్టర్‌ గుగులోత్‌ రవి  పర్యటించారు. పలు వీధులను సందర్శించి  డ్రైనేజీ, అంతర్గత రహదారులను పరిశీలించారు.  


జనవాసాల మధ్య చెత్తాచెదారం లేకుండా చూడాలని, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.  ఇళ్ల ఎదుట, వీధుల్లో మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించి  మొక్కలు నాటాలని సూ చించారు. నిరక్షరాస్యతపై పక్బడందీగా సర్వే చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కోసం రూ.2.29 కోట్లు  మంజూరైనట్లు తెలిపారు.  కోరు ట్ల  పట్టణంలోని  23, 5వ వార్డుల్లో పనులను అదనపు కలెక్టర్‌ రాజేశం పరిశీలించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పట్టణాభివృద్ధికి పాటుపడాలని కాలనీవాసులకు సూచించారు. మున్సిపల్‌ నుంచి వచ్చే వాహనానికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి అందించాలన్నారు. బహిరం ప్రదేశాల్లో చెత్తను వేసినా మలవిసర్జన చేసినా జరిమానా విధించాలని సిబ్బందికి సూచించారు. చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పాల్గొని పలు వీధుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.             


logo