మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Feb 26, 2020 , 03:30:02

యువకుడి అవయవదానం

యువకుడి  అవయవదానం

కథలాపూర్‌ : మండలంలోని భూషణరావుపేటకు చెందిన చిలివేరి సాయాబ్‌(41) ఈ నెల 19న బైక్‌పై నుంచి అదుపుతప్పి పడిపోయి తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద వైద్యశాలలో చేర్పించారు. 24న రాత్రి బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతడి అవయవాలు దానం చేయాలని వైద్యులు సూచించారు. కథలాపూర్‌ మండల రైతు సంఘం అధ్యక్షుడు గడ్డం భూమారెడ్డితో పాటు సాయాబ్‌ కుటుంబసభ్యులు జీవన్‌దాన్‌ సభ్యులతో చర్చించి అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. కేర్‌ వైద్యశాలలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి గుండె అవసరం కావడంతో మంగళవారం ప్రత్యేక బందోబస్తుతో సాయాబ్‌ గుండెను తీసుకెళ్లి అమర్చారు. సాయాబ్‌ కిడ్నీలు, కండ్లను వైద్యులు సేకరించినట్లు బంధువులు తెలిపారు. కుటుంబసభ్యుడిని కోల్పోయి కన్నీటి పర్యంతమవుతూనే ఇంకొకరి కోసం అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన సాయాబ్‌ కుటుంబసభ్యులను పలువురు అభినందించారు. 


logo
>>>>>>