బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Feb 25, 2020 , 02:58:10

కలిసికట్టుగా పనిచేయాలి

కలిసికట్టుగా పనిచేయాలి

ధర్మపురి, నమస్తే తెలంగాణ: అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేసూ, ప్రజల భాగస్వామ్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయంతం చేసి, ధర్మపురిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్‌ పిలుపునిచ్చారు. ధర్మపురి పట్టణంలోని ఒక టి, 15వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన స మావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మేజర్‌ పంచాయతీలను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసి, ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పల్లె ప్రగతి పేరుతో 30 రోజు ల ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించి, పారిశు ధ్యం, పచ్చదనం, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. జిల్లా అధికారులు, గ్రామ పాలకవర్గాలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, స్వ చ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత ప్రణాళిక కార్యక్రమంలో పాలు పంచుకోవడంతోగ్రామాల రూపు రేఖలే మారిపోయాయన్నారు. ఇదే స్ఫూర్తి తో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప ట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. సోమవారం నుంచి మార్చి 4 వరకు నిర్వహించే ఈ కా ర్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. మేజ ర్‌ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీ గా అప్‌గ్రేడ్‌ చేసి అభివృద్ధికి రూ.25కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 


అలాగే సీఎం కేసీఆర్‌ నృసింహస్వామి దర్శనానికి వచ్చిన సందర్భంలో మరో రూ.10కోట్లు, టెంపుల్‌ సిటీ అభివృద్ధికి రూ.50కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, సీఎం కేసీఆ ర్‌ ధర్మపురిని సందర్శించిన సమయంలో మరో రూ.50కోటు ప్రకటించారని గుర్తు చేశారు. రూ.135కోట్లతో రానున్న రోజుల్లో పట్టణ అభివృ ద్ధి ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుందన్నా రు. ధర్మపురి క్షేత్రంలో దక్షిణవాహినిగా ప్రవహి స్తూ.. పవిత్రమైన గోదావరిలో మురుగునీరు కలవకుండా రూ.3.65కోట్లతో మహా డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి ఘాట్‌ వద్ద దాదాపు మరో రూ.2.5కోట్లతో వాటర్‌ సీనరేజ్‌ ట్రీట్‌మెం ట్‌ ప్లాంట్‌ను నిర్మిస్తామన్నారు. 15వ వార్డులో ఉ న్న లోలెవల్‌ వంతెన స్థానంలో హైలెవల్‌ వంతెన, పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి హామీ ఇచ్చా రు. పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నామనీ, చింతామణి చెరువుకు రూ.1.35 కోట్లతో ఆధునికీకరణ, సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. రూ.66లక్షలతో మరో మురికి కూ పం తమ్మళ్లకుంటను సుందరీకరిస్తున్నట్లు చెప్పా రు. ధర్మపురిలో రూ.50లక్షలతో మతాశిశుసంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మపురికి కోర్టు మంజూరు చేయించామన్నారు. రూ.50 లక్షలతో అంబేద్కర్‌ సంఘ భవనం, అలాగే రూ.కోటితో ఆధునిక హంగులతో వైకుంఠధామా న్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలో వి ద్యుత్‌ సమస్య పరిష్కారానికి 300 విద్యుత్‌ స్తం భాలు మారుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇనుప విద్యుత్‌ స్తంభాల స్థానంలో సిమెం ట్‌ స్తంభాల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. 


మొక్కల సంరక్షణ అందరి బాధ్యత..

హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ అందరి బాధ్యతని మంత్రి ఈశ్వర్‌ స్పష్టం అన్నా రు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో హోటల్‌ హరిత ప్రాంగణంలో కలెక్టర్‌ రవితో కలిసి మొక్కలను నా టారు. హరితహారంలో భాగంగా గతేడాది నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు నాటాలో స్థలాలను గుర్తించాలని మంత్రి ఆదేశించారు.


పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి: కలెక్టర్‌ రవి

పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ రవి పి లుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో రూపొందించిన ప్రణాళికలు, గుర్తించాల్సిన సమస్యలు, చేపట్టాల్సి న కార్యక్రమాలపై మాట్లాడారు. పట్టణ ప్రగతిలో పది రోజుల పాటు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పది రోజుల పాటు సమస్యలు గుర్తించడం, అభివృద్ధ్ది పనులకు ప్రణాళికలు రూ పొందించడం, పారిశుధ్య పనులు నిర్వహించడం, మొక్కలు నాటడం, ఇంకుడు గుంతల నిర్మాణా లు చేపట్టాలని సూచించారు. వార్డు కమిటీ సభ్యు లు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో గుర్తించాలన్నారు. వార్డులను అభివృద్ధ్ది పరిచేందుకు స్థానికులతో సమావేశం ఏర్పాటు చే సి, వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య సమస్యలు లేకుండా చూడడం, డ్రైనేజీ లైన్లు, మురుగు కాలువలను శుభ్రపరచ డం, పట్టణాల్లోని పలు కాలనీల్లో మొక్కలు పెంచ డం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చెత్త కోసం డంప్‌ యార్డులు, వర్మికంపోస్టు ప్లాంట్లను ఏర్పా టు చేయడం, రోడ్లపై చెత్తాచెదారం, ముళ్ల కంపలు తొలగించడం, ప్రమాదకరంగా మారిన పాత బా వులను గుర్తించి, పూడ్చాలనీ, రోడ్ల మరమ్మతులు చేపట్టడం, పారిశుధ్య పనులు చేపట్టి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా రు. 


ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, పాఠశాలలు, దవాఖానలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని, పట్టణంలో నిరక్షరాస్యులను గుర్తించాలని ఆదేశించారు. వారికి ఎక్కడ చదువు చెప్పించాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. వీధి దీపాల నిర్వహణ, లోవోల్టేజీ సమస్యలు రాకుం డా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, ఆర్డీఓ నరేందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్మెమ్మ, ధర్మపురి, బుగ్గారం జడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్‌, ఎం పీపీ ఎడ్ల చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరి రా జేశ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, సౌళ్ల నరేశ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అక్కనపల్లి సునీల్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, నా యకులు సంగి శేఖర్‌, చిలివేరి శ్యాంసుందర్‌, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావ్‌, మురికి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>