సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Feb 25, 2020 , 02:56:30

డయల్‌ 100కు తక్షణం స్పందించాలి

డయల్‌ 100కు తక్షణం స్పందించాలి

జగిత్యాల క్రైం : డయల్‌ 100కు తక్షణమే స్పందించాలని జిల్లా ఎస్పీ సింధూశర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని పోలీస్‌ అధికారులతో ఆమె సోమవారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులు, కేసు పరిష్కారం, పెండింగ్‌ కేసులపై స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా పెంచాలన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతి రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తుల డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేయాలన్నారు. వాహన తనిఖీలు నిర్వహించేటప్పుడు మూడు కంటే ఎక్కువ చాలన్లు పెండింగ్‌లో ఉన్న వా హనాలను తక్షణమే సీజ్‌ చేయాలని తెలిపారు. 


పోట్రోలింగ్‌ చేసే సందర్భాల్లో తరచూ నేరాలకు పాల్పడే నేరస్థులను, రౌడీ షీట్‌, హిస్టరీ షీట్‌లు ఉన్న వారిని గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ప్రధాన రమదారులపై ఎటువంటి వాహనాలను పార్క్‌ చేయకుండా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తిచి వాటి నివారణకు సూచీ బోర్డులను ఏర్పా టు చేయాలని సూచించారు. నేర నియంత్రణలో పాటు కేసుల ఛేదనకు ఉపయోగపడే సీసీ కెమెరాలను నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తులను, ఎఫ్‌ఐఆర్‌లను పీడీఎఫ్‌, పార్ట్‌1, పార్ట్‌ 2 రిమాండ్‌ సీడీ, చార్జ్‌ షీట్‌, కోర్టు డిస్పోజల్‌ను ప్రతిరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను సీఐలు, డీఎస్పీలు పర్యవేక్షణ చేయా లన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీలు వెంక టరమణ, ప్రతాప్‌, ఏఓ చంద్రమోహన్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్రరావు, సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo