గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 25, 2020 , 02:54:50

వాటర్‌ ట్యాంకెక్కి రైతు నిరసన

వాటర్‌ ట్యాంకెక్కి రైతు నిరసన

మల్లాపూర్‌: భూ సమస్యలు పరిష్కరించాలని మండలంలోని కొత్తదాంరాజ్‌పలి గ్రామానికి చెందిన పన్నాల రాజరెడ్డి అనే రైతు సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ.. తనతో పాటు, తమ కుటుంబ సభ్యులకు చెందిన సర్వే నంబర్లు 639, 875, 880లో సుమారు ఐదెకరాల మేర భూములు పట్టాలు లేవని, తమ భూములు వేరేవాళ్లకు పట్టాలైనట్లు ఆరోపించారు. ఈ విషయమై మూడేండ్లుగా చాలాసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం రాలేదన్నాడు. గతంలో కూడా తాను గ్రామంలో వాటర్‌ట్యాంక్‌ నిరసన వ్యక్తం చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న నాయబ్‌ తాసిల్దార్‌ ఖాదర్‌, ఏఎస్‌ఐ చంద్రశేఖర్‌ సంఘటన స్థలానికి వచ్చి బాధిత రైతుతో మాట్లాడి శాంతింపజేశారు. భూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సదరు రైతు వాటర్‌ట్యాంక్‌ దిగి నిరసన విరమించాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. 


logo
>>>>>>