మంగళవారం 07 ఏప్రిల్ 2020
Jagityal - Feb 24, 2020 , 00:49:49

ఇక ‘పట్టణ ప్రగతి’

ఇక ‘పట్టణ ప్రగతి’

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  మున్సిపాలిటీల్లో నేటి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ఆరంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. వారం క్రితం సీఎం కేసీఆర్‌ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లతో పట్టణ ప్రగతిపై సమావేశం నిర్వహించి, చేపట్టాల్సిన కార్యక్రమాలపై మార్గనిరేర్దశం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల నేపథ్యంలో పది రోజుల ప్రణాళికలను రూపొందించారు. జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు సైతం నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమీక్షా సమావేశంలో పాల్గొని అధికారులకు, ప్రజాప్రతినిదులకు అవగాహన కల్పించారు. కొత్త మున్సిపల్‌ చట్టం, పట్టణ ప్రగతిపై శిక్షణ పొందిన నిపుణులు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు అవగాహన తరగతులు నిర్వహించారు. ప్రతి వార్డులో అరవై మందితో కమిటీని రూపొందించారు. 


కమిటీ సభ్యులు వార్డును సందర్శించి, వార్డులో ఉన్న సమస్యలను గుర్తించడంతో పాటు, ఆర్థిక వనరులతో కూడిన సమస్య, సాధారణ సమస్యలుగా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించి, వాటి పరిష్కారానికి కృషి చేయనున్నారు. పది రోజుల పాటు ఐదు మున్సిపాలిటీల్లో ప్రణాళికను అమలు చేయనున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం మున్సిపల్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రారంభించనున్నారు. ధర్మపురి మున్సిపాలిటీలో ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ సమావేశం నిర్వహించి, తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించనున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంభిస్తారు. పట్టణ ప్రగతి ప్రణాళిక వివరాలు మొదటి రోజు.. (ఫిబ్రవరి 24) l వార్డులు, కాలనీల్లో పాదయాత్ర l సమస్యలు, నిరక్షరాస్యుల గుర్తింపు l ఇంటింటికీ కావాల్సిన మొక్కల కోసం సర్వే l మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపు రెండో రోజు..(ఫిబ్రవరి 25) l పాత ఇంటి శిథిలాలు, వ్యర్థాల తొలగింపు l శిథిలావస్థలో ఉన్న ఇండ్ల కూల్చివేత l మురుగు కాల్వలు శుభ్రం మూడో రోజు.. (ఫిబ్రవరి 26) l నర్సరీల సందర్శన, మొక్కల సేకరణ, కొత్త నర్సరీలను ప్రారంభం కోసం సిద్ధం చేయడం l రోడ్లపై గుంతలు పూడ్చడం l ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలను శుభ్రం చేయడం, చెత్తాచెదారం తొలగింపు. l పిచ్చి మొక్కలు, పొదలు, తుప్పల తొలగింపు. నాలుగో రోజు..(ఫిబ్రవరి 27) l పాత విద్యుద్దీపాల స్థానంలో కొత్త ఎల్‌ఈడీ బల్బుల అమరిక. ఐదవ రోజు.. (ఫిబ్రవరి 28) l మొక్కలు నాటడం l శ్రమదానం l ఓపెన్‌ జిమ్‌ల కోసం స్థలాల ఎంపిక ఆరో రోజు.. (ఫిబ్రవరి 29) l చెత్త బుట్టల పంపిణీ l ఏకీకృత మార్కెట్‌ కోసం స్థల ఎంపిక ఏడో రోజు.. (మార్చి 1) l పాత స్తంభాలు, విరిగిన, తప్పు పట్టిన స్తంభాలను మార్చడం l వదులు తీగలను సరి చేయడం l ఇండ్ల మీదుగా వేలాడే తీగల మార్పిడి కోసం అంచనాలు సిద్ధం చేయడం ఎనిమిదో రోజు.. (మార్చి 2) l పాత బోర్లు/బావులను పూడ్చి వేయడం l మొక్కలు నాటడం/శ్రమదానం l వార్డు కమిటీల సమావేశం l వార్డు అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవడం

అమలు చేయనున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం మున్సిపల్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రారంభించనున్నారు. ధర్మపురి మున్సిపాలిటీలో ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ సమావేశం నిర్వహించి, తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించనున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంభిస్తారు. 


logo