శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 24, 2020 , 00:49:53

వైభవంగా రథోత్సవాలు

వైభవంగా రథోత్సవాలు

సారంగాపూర్‌/మల్లాపూర్‌ : జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. సారంగాపూర్‌ మండలంలోని పెంబట్ల దుబ్బ రాజేశ్వరాలయం, మల్లాపూర్‌ మండల కేంద్రంలోని కనకసోమేశ్వరాలయంలో స్వామివారల రథోత్సవాలు వైభవంగా జరిగాయి. దుబ్బరాజన్న క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని అందంగా అలంకరించిన రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. అంతకు ముందు రథం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులను గుడిచుట్టూ ప్రదక్షిణ చేయించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతా ల నుంచి లక్షకుపైగా భక్తులు తరలిరావడతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఐదురోజులు గా నిర్వహించిన బ్రహ్మో త్సవాలు రథోత్సవంతో ముగిశాయి. 


ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ, జగిత్యాల రూరల్‌ సీఐ రాజేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టిబందోబస్తు చర్యలు చేపట్టారు. ఆలయ ఆవరణలో మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు. ఆర్టీసీ అధికారులు ప్రతి 15నిమిషాలకు ఒక బస్సు చొప్పున జగిత్యాల నుంచి నడిపించారు. జగిత్యాలకు చెందిన శ్రీవైష్ణవి, ఎస్‌కేఎన్‌ఆర్‌, నలంద డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల వలంటీర్లు, ఉ త్సవ కమిటీ సభ్యులు, సిబ్బం ది, పాఠశాలల విద్యార్థులు భక్తులకు సేవలందించా రు. ఆర్యవైశ్య సం ఘం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 


పాఠశాల ఆవరణలో దుబ్బ రాజేశ్వర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సొల్లు సురేందర్‌, తాసిల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో పుల్లయ్య, ఆలయ ట్రస్టు ఫౌండర్‌ పొరండ్ల శంకరయ్య, ఆలయ ఈఓ కాంతారెడ్డి, సర్పంచులు బొడ్డుపెల్లి రాజన్న, ఆకుల జమున, పల్లికొండ రమేశ్‌, సింగిల్‌విండో చైర్మన్లు గురునాథం మల్లారెడ్డి, ఏలేటి నర్సింహారెడ్డి, ముప్పాల రాంచందర్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ కోల శ్రీనివాస్‌, జడ్పీ మాజీ సభ్యుడు కొల్ముల రమణ, నాయకులు పాత రమేశ్‌, తోడేటి శేఖర్‌ గౌడ్‌, ఎండబెట్ల వరుణ్‌ కుమార్‌, మర్యాల రాజన్న, గంప శ్రీనివాస్‌, యాసాల మల్లికార్జున్‌, సురేశ్‌, అనీల్‌ కుమార్‌, తోట లక్ష్మణ్‌, రాజేందర్‌, గంగారెడ్డి, గోపాల కిషన్‌, రాజిరెడ్డి, ఎస్‌ఐలు శీలం రాజయ్య, మనోహర్‌రావు, ఆరోగ్యం, ఆయా స్టేషన్ల పోలీస్‌ సిబ్బంది, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు తేలు రాజు, సిగిరి రాజిరెడ్డి, ప్రమోద, సునిత, తిరుమల అరవింద్‌, తిరుకోవెల ఆంజనేయులు, అరపెల్లి శ్రీనివాస్‌, బోగ గంగాధర్‌, కస్తూరి రాకేశ్‌, పడిగెల రాజిరెడ్డి, మరిపెల్లి రాజేశం, లావుడ్య రాజన్న, శీలం రాజేశం తదితరులు పాల్గొన్నారు.


కనక సోమేశ్వరా.. నమో నమః

మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని మల్లాపూర్‌ మండల కేంద్రంలోని కనక సోమేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఆదివారంతో అంగరంగ వైభవంగా ముగిసాయి. వేకువజామున కొండ దిగువన గల సోమేశ్వరాలయం ఆవరణలో 12.30గంటలకు సోమేశ్వర స్వామి రథోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు బల్యపల్లి కృష్ణప్రసాద్‌ శర్మ ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్లు, మంగళ వాయిద్యాల న డుమ శివ దీక్షాపరులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. వేలాది మంది శివ దీక్షాపరులు ‘ఓం నమః శివాయ’, ‘స్వామియే శ్రీ కనక సోమేశ్వరాయ నమః” అంటూ స్మరిస్తూ రథాన్ని లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి కరీంగనర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల ముగింపు అనంతరం శివదీక్షాపరులు దీక్షలను విరమించారు. శనివారం గ్రామంలో ఉర్సును కనుల పండువగా జరిపారు. వేడుకల్లో అవాంఛనీయ ఘటన లు జరగకుండా స్థానిక ఎస్‌ఐ రవీందర్‌, మెట్‌పల్లి ఎస్‌ఐ షకీల్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ కాటిపల్లి సరోజన, ఎంపీటీసీలు ఆకుతోట రాజేశ్‌, మరిపల్లి సత్తెమ్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు వేల్పుల రాజగంగారం, సింగిల్‌విండో చైర్మన్‌ వేంపేట నర్సారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకట్‌తో పాటు పలువురు పూజల్లో పాల్గొన్నారు.
logo