గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 22, 2020 , 01:05:50

మదినిండా శివుని తలచి..

మదినిండా శివుని తలచి..

మదినిండా శివుని ధ్యాసే నింపుకొని శివరాత్రి పర్వదినాన్ని భక్తులు శుక్రవారం వైభవంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచీ రాత్రి వరకు ఆలయాలకు పోటెత్తి ప్రత్యేక పూజల్లో తరించారు. పంచాక్షరీ మంత్రం ‘ఓం నమఃశివాయ’ ‘హరోం హర’..

  • జిల్లాలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
  • ఆలయాలకు పోటెత్తిన భక్తులు
  • మార్మోగిన పంచాక్షరీ మంత్రం
  • పెంబట్ల, కోటిలింగాలలో రద్దీ
  • గోదావరిలో పుణ్యస్నానాలు
  • మంత్రి ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌, జడ్పీ అధ్యక్షురాలు వసంత ప్రత్యేక పూజలు

(జగిత్యాల బృందం, నమస్తే తెలంగాణ): మదినిండా శివుని ధ్యాసే నింపుకొని శివరాత్రి పర్వదినాన్ని భక్తులు శుక్రవారం వైభవంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచీ రాత్రి వరకు ఆలయాలకు పోటెత్తి ప్రత్యేక పూజల్లో తరించారు. పంచాక్షరీ మంత్రం ‘ఓం నమఃశివాయ’ ‘హరోం హర’.. అంటూ శివనామస్మరణతో హోరెత్తించారు. జిల్లాలోని ముఖ్య ఆలయాలైన సారంగాపూర్‌ మండలం పెంబట్ల దుబ్బ రాజన్న, జగిత్యాల గుట్ట రాజేశ్వర, భక్త మార్కండేయ, విశ్వేశ్వర, బ్రాహ్మణవీధిలోని శివాలయం, అభయాంజనేయ ఆలయం, పురాణిపేట అంజనేయ స్వామి ఆలయం, పొలాసలోని పౌలస్తేశ్వరాలయం, మల్లాపూర్‌ మండలం కనకసోమేశ్వరాలయం, కోరుట్ల మహదేవ ఆలయం, నగరేశ్వరాలయం, మెట్‌పల్లి ఓంకారేశ్వరాలయం, చౌలమద్ది రాజేశ్వరాలయం, ధర్మపురిలోని రామలింగేశ్వర స్వామి, అక్కపెల్లి రాజేశ్వరస్వామి, నేరెళ్ల సాంబశివ, దమ్మన్నపేట వీరభద్రస్వామి, రాజారం శివాలయం, జైన రామలింగేశ్వరస్వామి, పెగడపల్లిలోని రాజరాజేశ్వర స్వామి, వెల్గటూర్‌ మండలం కోటిలింగాల కోటేశ్వరాలయాలు శివరాత్రి సందర్భంగా పోటెత్తాయి. ధర్మపురి, కోటిలింగాల వద్ద గోదావరిలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేసి ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని పలు ఆలయాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాలలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత ప్రత్యేక పూజలు చేశారు.          


logo