గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 22, 2020 , 00:58:51

రెండు వైపులా గోదారి జలాలు

రెండు వైపులా గోదారి జలాలు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదారి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌస్‌లో అధికారులు 5, 6, 7పంపులు నడిపిస్తూ, మంథని మండలం సిరిపురంలో

  • గాయత్రీ పంప్‌హౌస్‌ నుంచి ఎస్సారార్‌, ఎస్సారెస్పీ వైపు పరవళ్లు
  • రాంపూర్‌వైపు 4500 క్యూసెక్కులు
  • రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు మొదలు
  • రాజరాజేశ్వర జలాశయానికి రెండు వేల క్యూసెక్కులు
  • రాంపూర్‌వైపు 4500 క్యూసెక్కులు
  • రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు మొదలు
  • గాయత్రీ పంప్‌హౌస్‌ నుంచి ఎస్సారార్‌, ఎస్సారెస్పీ వైపు పరవళ్లు
  • రాజరాజేశ్వర జలాశయానికి రెండు వేల క్యూసెక్కులు

రామడుగు/ ధర్మారం/ బోయినపల్లి/ మల్యాల/ ఇబ్రహీంపట్నం/ తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదారి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌస్‌లో అధికారులు 5, 6, 7పంపులు నడిపిస్తూ, మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక అంతర్గాం మండలంలోని గోలివాడలో నిర్మించిన పార్వతీ పంప్‌హౌస్‌ 3, 6, 7 మోటర్ల ద్వారా ఎల్లంపల్లి బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని 6వ ప్యాకేజీలో నంది పంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. గురువారం నుంచి 5, 6 మోటర్ల ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తుండగా, శుక్రవారం కూడా అధికారులు అవే మోటర్లను నడిపిస్తున్నారు. నంది రిజర్వాయర్‌ నుంచి 7వ ప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా 8 ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలుతున్నాయి. ఇక్కడా 2, 3 పంపుల ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, శుక్రవారం కూడా వాటినే నడిపంచారు. కాగా, గాయత్రీ పంప్‌హౌస్‌లో శుక్రవారం సాయంత్రానికి 7.6 టీఎంసీల జలాలను ఎత్తిపోసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా, ఎత్తిపోతల ప్రక్రియను ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వేంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏఈఈలు శ్రీనివాస్‌, వైద సురేష్‌కుమార్‌, రమేష్‌నాయక్‌, వెంకటేష్‌, వరదకాలువ ఏఈఈ తిరుపతి, మెగా ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.


ఎల్‌ఎండీకి 2,902 క్యూసెక్కుల నీరు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి శుక్రవారం 2,902 క్యూసెక్కుల నీటిని పంపించారు. ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయం  రివర్స్‌ స్లూయిస్‌ ద్వారా దిగువకు నీటిని పంపుతున్నారు. జలాశయంలో 24.92 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. కాగా, లక్ష్మీపూర్‌ పంపు హౌస్‌ నుంచి వచ్చిన నీటిని యథావిధిగా దిగువకు వదలుతున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. 


ఎల్‌ఎండీ @ 11.272 టీఎంసీలు 

ఎస్సారార్‌ జలాశయం స్లూయిస్‌ నుంచి ఇన్‌ ఫ్లో కొనసాగుతుండగా తిమ్మాపూర్‌ మండలంలో ని ఎల్‌ఎండీలో నీటిమట్టం క్రమక్రమంగా పె రుగుతోంది. ప్రస్తుతం ఎల్‌ఎండీలోకి 7వేల క్యూ సెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంగా వస్తుండగా, 5773 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో రూపంలో బయటికి వెళ్తుంది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 11.272 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


ఇటు ఎస్సారార్‌కు.. అటు వరద కాలువకు.. 

ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువలో టీఎంసీ నీటిని ఎత్తిపోసి చెరువులు కుంటలు నింపేందుకు రాంపూర్‌, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గాయత్రీ పంప్‌హౌస్‌లో 2, 3 పంపుల ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తుండగా, వరదకాలువకు 99 కిలోమీటర్‌ వద్ద ఏర్పాటు చేసిన జంక్షన్‌పాయింట్‌ చేరుకొని అక్కడి నుంచి కుడి, ఎడమలకు తరలుతున్నాయి. ఈ మేరకు షానగర్‌ సమీపంలోని వరదకాలువకు 102 కిలోమీటర్‌ వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యూలేటర్‌ గేట్లను సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు కొం త మేర కిందికి దించడంతో స్థానిక వరదకాలువ తో పాటు గ్రావిటీ కాలువలో నీరు నిండుగా వెళుతున్నది. ఇటు ఎస్సారార్‌కు సుమారు 2వేల క్యూ సెక్కులు, పునర్జీవ పథకంలో భాగంగా ఎగువన రాంపూర్‌ పంప్‌హౌస్‌కు 4,500 క్యూసెక్కులు తరలుతున్నాయని వరదకాలువ ఏఈఈ తిరుపతి తెలిపారు.  


రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేటలో ఎత్తిపోతలు

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా మల్యాల మండలం రాంపూర్‌, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ల నుం చి కాళేశ్వర జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నా యి. ప్రస్తుతం రాంపూర్‌ పంప్‌హౌస్‌కు రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి 4500 క్యూసెక్కుల వరద రాగా ని రంతరాయంగా రెండు మోటర్లను నడిపిస్తూ రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ వైపు ఎత్తిపోస్తున్నట్లు వ రద కాలువ ఈఈ సుధాకిరణ్‌ తెలిపారు. రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ నుంచి 3, 6వ మోటర్లను ప్రారంభించి ఎస్సారెస్పీ వైపు నీటిని ఎత్తిపోస్తున్నా రు. వరద కాలువను ఆనుకొని ఉన్న దిగువ చెరువులు, కుంటలను ఓపెన్‌ తూంల ద్వారా నింపుతామని ఈఈ తెలిపారు. రాంపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి మూడు రోజుల క్రితం రెండు పంప్‌ల ద్వా రా నీటిని విడుదల చేయగా శుక్రవారం మధ్యా హ్నం రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌కు నీరు చేరుకున్నది. ఇక్కడి నుంచి బాల్కొండ వరకు వరద కాలువలో నీటిని నింపనున్నారు. ప్రస్తుతం వరద కాలువలో 5 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది. రబీని దృష్టిలో ఉంచుకొని 9 మీటర్ల వరకు నింపనున్నారు. రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ నుంచి పోచంపాడు వరకు ఉన్న 34 ఓపెన్‌ తూముల ద్వారా 49 చెరువులను నింపనున్నారు. logo