బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Feb 20, 2020 , 03:01:30

అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు

అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు


జగిత్యాల రూరల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌, ఆస రా పింఛన్లు, జీవనోపాధిలాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కు మార్‌ పేర్కొన్నారు. జగిత్యాల అర్బన్‌ మండలంలోని తిప్పన్నపేట గ్రామంలో నూతనంగా రూ.1 కోట్ల 25లక్షల 80వేలతో నిర్మించిన 20 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను జడ్పీ అధ్యక్షురాలు దావ వసం త, కలెక్టర్‌ జీ రవి, అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సా గుతున్నదని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నా రు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వా రీగా ఇండ్లు నిర్మించి అందజేస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎమ్మెల్యే కోటా నుంచి వెయ్యి ఇండ్లు నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నారు. జగిత్యాల మండలంలో నర్సింగాపూర్‌, ధరూర్‌ గ్రామాల శివారు లో ఇదివరకే 20ఇండ్లను ప్రారంభించామని తెలిపారు. 


పట్టణంలోని నిరుపేదల కోసం 360ఇండ్లు మం జూరయ్యాయని, వీటిని త్వరలోనే భూమిపూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్నడూ, ఎవరూ చేయని వి ధంగా సీఎం కేసీఆర్‌ పేదలకు సొంతిళ్లు ఉండాలనే సంకల్పంతో రెండు పడక గదుల నిర్మాణాన్ని చేపట్టారన్నారు. గృహాల్లో అన్ని మౌలిక వసతులు క ల్పించామని, లబ్ధిదారులు తమ ఇంటి ముందు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్ర భుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభివృద్ధి జరగాలంటే అందరి సమష్టి కృషితోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌ జీ రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పడక గదుల ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. 


డబు ల్‌ బెడ్‌ రూం ఇండ్ల పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. జిల్లాలో 920 డబు ల్‌ బెడ్‌ ఇండ్లు తది దశలో ఉన్నాయని, వాటిని ప్ర జాప్రతినిధుల సహకారంతో త్వరలోనే పూర్తి చే సేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం ప్ర వేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు  ప్రజలకు అం దేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ జీ రవి, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రౌతు జయ, అర్బన్‌ జడ్పీటీసీ సంగెపు మహేశ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ బేతి రాజేశం, అర్బన్‌ వైస్‌ ఎంపీపీ ములాసపు లక్ష్మి, ఉప సర్పంచ్‌ బుచ్చన్న, ప్రత్యేక అధికారి రాజేశం, ఈఈపీఆర్‌ మనోహర్‌ రెడ్డి, ఏఈ ముద్దం ప్రకాశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రౌతు గంగాధర్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దావ సురేశ్‌, కౌన్సిలర్‌ ముస్కు నారాయణ రెడ్డి, నాయకులు క్యాదాసు నాగయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


logo