బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Feb 20, 2020 , 02:57:40

దయచూడు దుబ్బ రాజన్నా..

దయచూడు దుబ్బ రాజన్నా..


సారంగాపూర్‌ : మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం పెంబట్ల దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయం త్రం నుంచి బ్రహ్సోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాత్రి స్వస్తి పుణ్యహవచనం, అంకురార్పణ కార్యక్రమాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు సాగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానుండగా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 20న రాత్రి స్వామి వారి కల్యాణం, 21న మహా శివరాత్రి సందర్భంగా రాత్రి 12గంటలకు లింగోద్భవ కాలాన నిశీ పూజ, రుద్రాభిషేకం, జా గరణ, 22న పారణ, అన్నపూజ, 23న ఉదయం 10:30కు స్వామి వారి రథోత్సవాన్ని కనుల పండువలా నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి తిరుపతిరెడ్డి వెల్లడించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఆలయ ఆవరణ, వెన క వైపు చలువ పందిళ్లు వేశామని తెలిపారు. పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు.  


logo