మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Feb 19, 2020 , 01:06:02

గజ్వేల్‌ అద్భుతం

గజ్వేల్‌ అద్భుతం

సీఎం కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ పట్టణ కేంద్రం అద్భుతంగా ఉందనీ, అభివృద్ధికి మారుపేరుగా నిలిచి ఇతర పట్టణాలకు ఆదర్శంలా మా రిందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, జిల్లాలోని మున్సిపల్‌ అధ్యక్షులు అభిప్రాయపడ్డారు.

  • ఇతర పట్టణాలకు ఆదర్శం
  • సందర్శించిన మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే, కలెక్టర్‌, మున్సిపల్‌ అధ్యక్షులు
  • సమీకృత మార్కెట్‌లో రైతులకు కల్పించిన వసతుల పరిశీలన

ధర్మపురి నమస్తే తెలంగాణ/ జగిత్యాల రూరల్‌ : సీఎం కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ పట్టణ కేంద్రం అద్భుతంగా ఉందనీ, అభివృద్ధికి మారుపేరుగా నిలిచి ఇతర పట్టణాలకు ఆదర్శంలా మా రిందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, జిల్లాలోని మున్సిపల్‌ అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావే శం అనంతరం వారు గజ్వేల్‌ పట్టణాన్ని సందర్శించారు. సమీకృత మార్కెట్‌, అందులో రైతులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ప్రతి పట్టణంలోనూ ఇలాంటి మార్కెట్‌లో అందుబాటులోకి తేవాల్సిన అవసముందన్నారు. అనంతరం వైకుంఠధామాన్ని పరిశీలించారు. మంత్రి, ఎమ్మెల్యేలతో జగిత్యాల, రాయికల్‌, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ అధ్యక్షులు బోగ శ్రావణి, మోర హనుమాండ్లు, సంగి సత్య మ్మ, రాణవేని సుజాత, అన్నం లావణ్య తదితరులున్నారు. 


logo
>>>>>>