మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Feb 18, 2020 , 01:48:38

జన హృదయనేతకు హరిత కానుక

జన హృదయనేతకు  హరిత కానుక

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జనహృదయ నేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 66వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా పండుగలా సాగాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా సబ్బండ వర్ణాలు స్వచ్ఛందంగా మొక్కవోని దీక్షతో మొక్కలు నాటి కానుకగా అందించారు. ‘ఈచ్‌ వన్‌-ప్లాంట్‌ వన్‌'లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, జడ్పీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మొక్కలు నాటి జన్మదిన కానుకగా ఇచ్చారు. 


logo
>>>>>>