సోమవారం 30 మార్చి 2020
Jagityal - Feb 17, 2020 , 03:31:00

సింగిల్‌ విండోలపై గులాబీ జెండా

సింగిల్‌ విండోలపై గులాబీ జెండా

(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ)జిల్లాలో సహకార సంఘాలపై గులాబీ జెండా ఎగిరింది. 51సంఘాలకు గానూ 48సంఘాల్లో ఆదివారం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగ్గా 44సంఘాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే చైర్మన్‌, వైస్‌చైర్మన్లుగా ఎన్నికయ్యారు. రెండు సంఘాలను కాంగ్రెస్‌, రెండు సంఘాలను బీజేపీ దక్కించుకున్నాయి. రెండు సంఘాల ఎన్నికలు నేటికి వాయి దా పడగా, మరో సంఘానికి ఎన్నిక రద్దయింది. 


18మండలాల్లో ఇలా..

జగిత్యాల మండలంలో రెండు సంఘాలను టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకున్నది. రాయికల్‌లో మూడు సంఘాలు టీఆర్‌ఎస్‌, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్‌కు దక్కాయి. సారంగాపూర్‌లో ఒక టి వాయిదా పడగా మరొకటి టీఆర్‌ఎస్‌కు, బీర్‌పూర్‌లో రెండింటికి ఒకటి టీఆర్‌ఎస్‌, మరొకటి కాంగ్రెస్‌కు దక్కా యి. కొడిమ్యాల మూడింటికి మూడు టీఆర్‌ఎస్‌ కు, మల్యాల రెండు టీఆర్‌ఎస్‌కు, ఒకటి వాయిదా పడగా మరో సం ఘానికి ఎన్నికలు రద్దయ్యాయి. ధర్మపురి మండలంలో మూడు టీఆర్‌ఎస్‌, పెగడపల్లిలో మూడు టీఆర్‌ఎస్‌, వెల్గటూర్‌ రెండు, గొల్లపల్లిలో రెండు మొత్తంగా 10 సంఘాలనూ గులాబీ మద్దతు అభ్యర్థులే గెలుచుకొని నియోజకవర్గాన్ని క్లీన్‌స్వీప్‌ చేశారు. కోరుట్ల మండలంలో ఆరు సంఘాలూ టీఆర్‌ఎస్‌, మెట్‌పల్లిలో మూడింటికి మూడూ టీఆర్‌ఎస్‌, మల్లాపూర్‌లో నాలుగు, ఇబ్రహీంపట్నంలో మూడు, కథలాపూర్‌లో మూడు, మేడిపల్లిలో మూడు సంఘాలను టీ ఆర్‌ఎస్‌ దక్కించుకోగా ఒకటి బీజేపీ సొంతమైంది.  కాగా గెలిచిన టీఆర్‌ఎస్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సంజయ్‌ అభినందించారు.


రెండు చోట్ల వాయిదా.. ఒకటి క్యాన్సిల్‌

మల్యాల మండలం నూకపల్లి, సారంగాపూర్‌ లో కోరం లేదని ఎన్నికలు నేటికి వాయిదా వేశారు. మల్యాల మండలం తక్కళ్లపల్లి సహకార సంఘానికి వేసిన నామినేషన్‌ పత్రాల్లో తప్పులున్నాయని ఎన్నికను రద్దు చేశారు. తిరిగి రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 


logo