శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 17, 2020 , 03:29:50

మొక్కలు నాటుదాం..కానుక ఇద్దాం..

మొక్కలు నాటుదాం..కానుక ఇద్దాం..

(జగిత్యాల, నమస్తే తెలంగాణ)ఎన్నో ఏండ్ల పోరాటాల తర్వాత సాధించుకున్న తెలంగాణను అనేక రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్‌ పలు వినూత్న పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ తన సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి, ప్రకృతి విధ్వంసం పెరిగిన తర్వాత వన్యప్రాణులు జనారణ్యంలోకి రావడం ప్రారంభించాయి. ముఖ్యంగా కోతులు నివాస ప్రాంతాల్లో చొరబడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అడవుల్లో వాటికి ఆహారాన్ని అందించే చెట్లను నరకడంవల్ల కోతులు జనజీవనంలోకి వస్తున్నాయనే యధార్ధాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరివిగా మొక్కలు నాటి తగ్గిన పచ్చదనాన్ని పెంచడం, భవిష్యత్‌ తరాలకు రాష్ట్రంలో మంచి బతుకును ఇవ్వడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇపుడు విజయవంతంగా కొనసాగుతోంది.  


మొక్కల పెంచడం కోసం చట్టం.. 

ఎన్నో ఉద్దేశాలతో నాటుతున్న మొక్కలను సంరక్షించడంలో బాధ్యత లేక పోవడంతో అనేక మొక్కలు ఎండి పోవడం సహజంగా మారింది. ఈ నేపథ్యంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతలను చట్టం రూపంలో తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. పంచాయతీ రాజ్‌ చట్టంతో నర్సరీల పెంపకం బాధ్యతలను పంచాయతీలకు అప్పగించారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికించని పక్షంలో సంబంధిత పంచాయతీలపై కఠిన చర్యలు తీసుకునేలా పంచాయతీ రాజ్‌ చట్టం-2018లో రూపొందించారు. ఈ చట్టంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. నాటిన మొక్కలను సంరక్షించాలనే బాధ్యతను ఈ చట్టం తప్పనిసరి చేసింది.   హారంలో నాటిన మొక్కలను పీకేసినా, పశువులచే మేపి నా పం చాయతీలు పెద్ద మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నాయి. ప్రతి పంచాయతీ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసి మొ క్కలు పెంచుకొని వాటిని అదే గ్రామాల్లో నాటుకుని సంరక్షించించుకునేలా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు.   పండ్ల మొ క్కలే కాదు నీడ నిచ్చేవి, ఆదాయాన్ని సమకూర్చే మొక్కలు కూ డా ఇపుడు గ్రామాల నర్సరీల్లో అందుబాటులో ఉంటున్నాయి.. 


పుట్టిన రోజు కానుకగా మొక్కలు.. 

పర్యావరణ ప్రేమికుడుగా, తెలంగాణను ఆకుపచ్చ లోగిలిలా మార్చాలని కలలుకంటున్న సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని ప్రభుత్వ యం త్రాంగం, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు నిర్ణయించుకున్నాయి. సోమవారం ఆయన పుట్టిన రోజున ఒక్కో కార్యకర్త ఒక్కో మొక్కను నాటాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారా వు పిలుపునిచ్చారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్‌ పుట్టిన రోజు మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. 

 

 జగిత్యాల నియోజకవర్గంలో 1.70లక్షలు లక్ష్యం 

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా జగిత్యాల నియజకవర్గంలో 1.70లక్షల మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారు. పంచాయతీల ఆధ్వర్యం లో 40వేల మొక్కలు నాటించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్‌ విండో చైర్మ న్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకులు కూడా ప్రత్యేక హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత కూడా జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ స్థా యి సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఏ ర్పాట్లు చేశారు. అన్ని గ్రామ పంచాయతీల్లో 100కు తక్కువ కా కుండా మొక్కలు నాటాలని, పాఠశాలలు, కాలువలు, చెరువులు లాంటి స్థలాల్లో మొక్కలు నాటాలని కలెక్టర్‌ జీ రవి ఆదేశాలు జా రీ చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చే సింది. ఎమ్మెల్యే సంజయ్‌ జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు కట్టపై సోమవారం ఉద యం 9 గంటలకు మొక్క నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా కథలాపూర్‌ మండలం చింతకుంట శివాలయ ఆవరణలో జడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ ఆదివారం మొక్క లు నాటారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో విరివిగా మొ క్కలు నాటాలని ప్రజలను కోరారు. 


అందరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే సంజయ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. జగిత్యాలలో ఆదివారం ఆయన మాట్లాడుతూ హరితహారం స్ఫూర్తిగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా నాటి, వాటిని కాపాడుకోవాలన్నారు. నియోజకవర్గ పరిధిలో 1,70,220 మొక్కలను ఎంపీపీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకులు నాటాలని పిలుపునిచ్చారు.


ప్రతి ఇంటి ఆవరణలో నాటుకోవాలి : మున్సిపల్‌ అధ్యక్షురాలు శ్రావణి

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీ  పరిధిలోని ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని మున్సిప ల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి పిలుపునిచ్చారు. పట్టణాన్ని హరిత జగిత్యాలగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.


logo