గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 17, 2020 , 03:25:39

చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు సహకారమందిస్తా

చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు సహకారమందిస్తా

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల నియోజకవర్గం లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున గెలిచిన ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు పూర్తి సహాకారం అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట ర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని 11 ప్రాథమిక సహకార సం ఘాలకు గాను 8 ప్రాథమిక సహకార సంఘా ల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ మా ట్లాడుతూ సహకార సం ఘాల ఎన్నికల్లో సమిష్టి కృషితో, విజయం సా ధ్యమైందన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు రై తులకు రుణాలు, ఎరువులు అందించడంలో పారదర్శకంగా మెలగాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, మాజీ ఎంపీ కవిత సహకారంతో రైతుల సమస్యల పరిష్కారంలో ముందుకు వెళ్తామన్నా రు. ఈ కార్యక్రమంలో జగిత్యాల సింగిల్‌ విండో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పత్తిరెడ్డి మహిపాల్‌ రెడ్డి, శీలం సురేందర్‌, కోనాపూర్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్లు గుర్నా థం మల్లారెడ్డి, గంగాధరి మంగమ్మతో పాటు రూ రల్‌ ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్‌, కొలుగూరి దామోదర్‌ రావు, ధరూర్‌ సర్పంచ్‌ డెక్క ప్రభాకర్‌, అంకం సతీష్‌, కోల శ్రీనివాస్‌ తదితరులున్నారు. 


logo
>>>>>>