గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 16, 2020 , 03:22:39

గ్రామ గ్రామాన మొక్కలు నాటాలి

గ్రామ గ్రామాన మొక్కలు నాటాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటాలని కలెక్టర్‌ జీ రవి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కలపై అమిత ప్రేమతో సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ఈనెల 17న   కేసీఆర్‌ జన్మదినం ఉ న్నందున గ్రామ, మండల, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అన్ని పంచాయతీల్లో మొక్కలు నాటాలని సూచించా రు. స్థలాన్ని బట్టి నచ్చిన, ఇష్టమైన మొక్కలు నాటాలనీ, ప్రతి పంచాయతీలో 66 మొక్కల నుంచి 100 మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఒక వేళ స్థలం సరిపడా లేకుంటే మంకీఫుడ్‌ కోర్టులో చనిపోయిన మొక్క ల స్థానంలో కొత్తవి నాటాలన్నారు. ప్రతి ప్లాంటేషన్‌లో నచ్చిన పెద్ద మొక్కలను నాటుకోవాలనినీ,  వీలైతే సీఎం కేసీఆర్‌కు ఇష్టమైన కదంబ మొక్కను నాటాలని సూచించారు. నచ్చిన మొక్కలు తీసు కొని వలంటరీగా నాటుకోవాలన్నారు. నాటినప్రతి మొక్కా బతికేలా ఎవరైనా దత్తత తీసుకుని  సంరక్షించే బాధ్యత చూసుకోవాలన్నారు. పంచాయతీ నర్సరీల్లో సరిపడా పెద్ద మొక్కలు లేకుంటే  పక్కనున్న పంచాయతీ నుంచి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బీ రాజేశం, డీఆర్వో అరుణశ్రీ పాల్గొన్నారు. 


మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్ష

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల కమిషనర్లతో  కలెక్టర్‌ రవి తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించా రు. ఇంటి పన్ను, మిషన్‌ భగీరథ నీటి పన్ను, సిబ్బంది ఖాళీలు, చనిపోయిన సిబ్బందికి రావాల్సిన బెనిఫిట్స్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌కు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఇన్సూరెన్స్‌, ఇల్లీగల్‌ లే అవుట్స్‌, ఫ్లాట్స్‌, టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టిన పనుల్లో పెండింగ్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, స్వచ్ఛ ఆటోలు, వార్డుల వారీగా ప్రత్యేకాధికారులు, వార్డు కమిటీల లిస్టు, డీఆర్‌సీ కేంద్రాలు, డంప్‌యార్డులు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, ప్రతి ఇంటికీ సెప్టిక్‌ ట్యాంక్‌, సోక్‌పిట్స్‌ తదితర అంశాలపై మున్సిపాలిటీల వా రీగా విడివిడిగా రివ్యూ నిర్వహించారు. ప్రతి ము న్సిపల్‌ కమిషనర్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఉండి సానిటేషన్‌కు సంబంధించిన పనులను చూసుకోవాలని సూచించారు. త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని ప్రవేశపెట్టనుండగా దానిపై త్వరగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటి పన్నులు పెం డింగ్‌ లేకుండా చూసుకోడాలనీ, ఇందుకోసం స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టాలనీ, ఎలాంటి అలసత్వం వహించకుండా ప్రతి ఉద్యోగి విధిగా పనిచేసేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  


logo