శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 15, 2020 , 00:11:02

గోవింద గోవింద

గోవింద గోవింద
  • గోవింద నామస్మరణతో మార్మోగిన బీర్‌పూర్‌ గుట్టలు
  • అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహుడి రథోత్సవం
  • వేలాదిగా తరలివచ్చిన భక్తజనం


సారంగాపూర్‌ : వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామ స్మరణలతో బీర్‌పూర్‌ గుట్టలు మార్మోగాయి. బీర్‌పూర్‌ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు కనులపండువలా జరిగాయి. చివరి ఘట్టం స్వామి వారి రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గుట్టపై నుంచి కిందికి తీసుకువచ్చారు. రథం ముందు ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని ఆశీనులు చేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గుట్టకింద వంటలు చేసుకుని భోజనాలు చేశారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ దక్షణామూర్తి, జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, జగిత్యాల రూరల్‌ సీఐ రాజేశ్‌, స్థానిక ఎస్‌ఐ మనోహర్‌ రావు, సారంగాపూర్‌, రాయికల్‌ ఎస్‌ఐలు శీలం రాజయ్య, ఆరోగ్యం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ స్టేషన్ల ఎస్‌ఐలు, పోలీసులు భారీ భద్రత కల్పించారు. 


జాతర ప్రాంగణంలో బీర్‌పూర్‌ వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు, జగిత్యాల శ్రీవైష్ణవి డిగ్రీ కళాశాల విద్యార్థులు, వలంటీర్లు సేవలందించారు. భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. ఉత్సవాల్లో ఎంపీపీ మసర్తి రమేశ్‌, జడ్పీ సభ్యురాలు పాత పద్మ, ఉపాధ్యక్షుడు బల్మూరి లక్ష్మణ్‌ రావు, సర్పంచ్‌ గర్షకుర్తి శిల్ప, సింగిల్‌ విండో చైర్మన్‌ ముప్పాల రాంచందర్‌ రావు, తాసిల్దార్‌ నాగార్జున, ఎంపీడీవో మల్లారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దం శ్రీనివాస్‌, మాజీ జడ్పీ సభ్యులు ముక్క శంకర్‌, ముప్పాల జలజ, కొల్ముల రమణ, ఆలయ మాజీ చైర్మన్లు గొడుగు కేశవులు, ప్రదీప్‌ రావు, రమణారావు, ఆంజనేయులు, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌ రావు, వేదపండితులు ఒద్దిపర్తి రామాచార్యులు, సంతోష్‌కుమార్‌, మధుకుమార్‌, లక్ష్మణమూర్తి, సంజయ్‌, గోపాలకృష్ణ, రేవంత్‌, వంశీకృష్ణ, రాజయ్య, దేవాదాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo