శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 14, 2020 , 23:48:28

మానవత్వాన్ని చాటిన మంత్రి కొప్పుల

మానవత్వాన్ని చాటిన మంత్రి కొప్పుల
  • చొప్పదండిలో రోడ్డు ప్రమాదం
  • కొత్తూరుకు చెందిన వ్యక్తికి గాయాలు
  • దగ్గరుండి కాన్వాయ్‌లో వైద్యశాలకు పంపిన ఈశ్వర్‌

చొప్పదండి, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సొంత కాన్వాయ్‌లో వైద్యశాలకు తరలిం చి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి జవహర్‌ నవోదయ విద్యాల యం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన కొమ్మ భూమయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ధర్మారం నుం చి కరీంనగర్‌ వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఘటనా స్థలంలో ఆగి అపస్మారక స్థితిలో ఉన్న భూమయ్య వివరాలు తెలుసుకొని కాన్వాయిలోనే దగ్గరుండి కరీంనగర్‌ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సేవలందించిన మంత్రికి అభినందనలు వెల్లువెత్తాయి.


logo