శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 14, 2020 , 03:58:27

అపర భగీరథుడికి ఆత్మీయ పలుకరింపు

అపర భగీరథుడికి ఆత్మీయ పలుకరింపు
  • కాళేశ్వరంలో సీఎం కేసీఆర్‌ పర్యటన
  • లక్ష్మీ బరాజ్‌ విహంగ వీక్షణం
  • కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష
  • ఆలయ అభివృద్ధిపై చర్చ
  • పుష్కరఘాట్‌, ఆలయంలో ప్రత్యేక పూజలు

అపర భగీరథుడు, జలసాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరాన పర్యటించారు. బుధవారం రాత్రి కరీంనగర్‌ శివారులోని తీగలగుట్టలపల్లిలో ఉన్న కేసీఆర్‌ భవన్‌లో బస చేసిన ఆయన, గురువారం ఉదయం పూర్వ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరానికి హెలీకాప్టర్‌లో వెళ్లారు.  కలల ప్రాజెక్టుపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నిండుకుండలా మారిన లక్ష్మీ బరాజ్‌ను చూసి పులకించిపోయారు. కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కరఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. నదీమతల్లికి చీర, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, నాణేలు సమర్పించారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. హెలికాప్టర్‌ ద్వారా లక్ష్మీ బరాజ్‌, బ్యాక్‌ వాటర్‌ను వీక్షించారు. తిరిగి కరీంనగర్‌ చేరుకొని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు.


logo