గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 12, 2020 , 01:24:58

పసుపు రైతుకు ధర దిగులు

పసుపు రైతుకు ధర దిగులు

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ :  మార్కెట్లో పలుకుతున్న ధరలతో  పసుపు రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుత రేట్లకు కనీసం పెట్టుబడి కూడా సమం అయ్యే పరిస్థితి లేదని  వేదనకు లోనవుతున్నారు. నిజానికి ఒకప్పుడు పసుపును ‘పచ్చ బం గార’మని పిలుచుకునే వారు. కానీ నేడు ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు.  పంటకు కనీస మద్దతు ధర లేకపోగా షేర్‌ మార్కెట్‌ను తలపించేలా అప్పుడే పెరిగడం, ఆమాంతం పడిపోవడం పరిపాటిగా మారింది. పసుపు బోర్డుతో ఇచ్చి పం టకు మద్దతు ధర కల్పిస్తుందనుకుంటే ఎలాంటి ప్రయోజనం లేని స్పైస్‌ బోర్డుతో తమ ఆశలపై నీళ్లు జల్లారని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.  

ఒక్క కోరుట్ల నియోజకవర్గ పరిధిలోనే సుమారు 16వేల ఎకరాల్లో సాగు

జిల్లాని కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్‌, మేడిపల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మం డలాలు, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌, బాల్కొం డ నియోజకవర్గాల్లో  పసుపు పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ సీజన్‌లో ఒక్క  కోరు ట్ల నియోజకవర్గ పరిధిలోనే  సుమారు 16వేల  ఎ కరాల్లో  పసుపు పంట పండించారు. దిగుబడి ప్ర క్రియ కొద్ది రోజులుగా మొదలైంది. పసుపు  తవ్వ కం, కాడి (కొమ్ము), గోల (మండ)ను వేరు చేయ డం,  పచ్చి కొమ్ము, మండను ఉడకబెట్టి ఆరబోయడం, మార్కెట్‌కు తరలించడం వంటి పనులు ఊపందుకున్నాయి.  మెట్‌పల్లి వ్యవసాయ మా ర్కెట్‌లో  వారం కిందట క్రయ, విక్రయాలు ప్రా రంభమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో  పలుకుతున్న ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో పం ట సాగు రైతులు  ఒకింత ఆందోళనకు లోనవుతున్నారు. సోమవారం మెట్‌పల్లి మార్కెట్‌లో క్విం టాల్‌కు కనిష్ఠంగా రూ. 4700, గరిష్ఠంగా రూ.5 211 మాత్రమే పలికింది.   పంట దిగుబడి పెరగడంతో  ఉన్న ఈ కాస్త ధరలు కూడా స్థిరంగా ఉం టాయా? లేక మరింత పడిపోతాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

పెట్టుబడి రావడమూ గగనమే!

ప్రస్తుత ధరలతో పంటసాగుకు వెచ్చించిన పె ట్టుబడి సైతం రావడం కష్టమేనన్న ఆవేదన  రైతు ల్లో కనిపిస్తున్నది. ఎకరం విస్తీర్ణంలో పసుపు సాగు కు సంబంధించి సేంద్రియ, రసాయన ఎరువుల కు, దుక్కి దున్ని విత్తనం వేసి నుంచి దిగుబడి అ య్యే వరకు ఖర్చు రూ.60వేల నుంచి రూ.70 వే ల దాకా అవుతుంది. ఎలాంటి తెగుళ్లూ ఆశించక, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి కనీసం  20 నుంచి 25 క్వింటాళ్ల పసుపుకొమ్ముల దిగుబడి వస్తుంది.  పచ్చి పసుపును ఉడకబెట్టి, ఆరబోయడం వల్ల కొమ్ము, మండ తూకం శాతం తగ్గుతుంది. పంట ఉత్పత్తిని విక్రయించగా వచ్చే డబ్బుతో  పంటకు పెట్టిన పెట్టుబడి వ్యయం కనీ సం సమం కాదుకదా అప్పే మిగులుతుందని ప లువురు రైతులు వాపోతున్నారు. క్వింటాల్‌కు  కనీసం రూ.7 వేలు ఆపై ఉంటే  కొంత మేర లాభదాయకమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  పంట  కొనుగోలు పూర్తిగా వ్యాపారులపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం ఈ నామ్‌ ప్ర వేశపెట్టినా ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసేలా  టెక్నాలజీ విస్తరించకపోవడం,  ఉన్న మార్కెట్‌కే  ‘ఈ నామ్‌'  పరిమితం కావడం,  పసుపు కొనే వ్యాపారులు పరిమితంగా ఉండడం, వీరి మధ్య  వ్యాపార పోటీతత్వం అం తంత మా త్రమే కావడంతో ధరలు పెరగకపోవడానికి  ఇదో కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 

పసుపు బోర్డు ఆశలపై కేంద్రం నీళ్లు

   పసుపు బోర్డుపై  రైతులు పెట్టుకున్న ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. పసుపు బోర్డు వస్తుందని ఊరించిన  కేంద్రం, తీరా సుంగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని తెరపైకి తెచ్చి మమ అనిపించుకోవడం విమర్శలకు తావిస్తున్నది. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో పసుపు బోర్డే ప్ర ధాన ఎన్నికల అంశం కావడంతో  రైతుల  డిమాండ్‌ను పసిగట్టిన అప్పటి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, ఎంపీ అభ్యర్థి అర్వింద్‌  పసుపు బోర్డునే త మ ఎన్నికల హామీగా చేసుకుని రైతుల్లో ఆశలు చి గురింపజేశారు. మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తుందని, తప్పకుండా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు. ఎంపీ అభ్యర్థి అర్వింద్‌  ఒక అడుగు ముందుకేసి తనను ఎంపీ గా గెలిపిస్తే  పది రోజుల్లో పసుపు బోర్డు మంజూ రు  చేయిస్తానని  లేదంటే రాజీనామా చేస్తానం టూ బాండ్‌ పేపర్‌ సైతం రాసిచ్చారు. వీరి మా టలు నమ్మిన  మెజార్టీ రైతులు  మొగ్గు చూపి గెలుపునకు తోడ్పడ్డారు.  ఎంపీగా గెలిచి ఎనిమిది నెల లు గడిచినా పసుపు బోర్డు లేదు. పసుపునకు  కనీ స మద్దతు ధర లేదు.  ఎంపీ తీరుపై అసంతృప్తితో పసుపు రైతులు  కదం తొక్కడం మొదలు పెట్టా రు. రైతుల సెగను గుర్తించిన సదరు ఎంపీ, ఎన్నికల్లో ఇచ్చిన  హామీని మరిచి  పసుపు కంటే మిం చిన ప్రయోజనాలు స్పైసెస్‌ బోర్డుతో కలుగుతాయని, ఒక్క పసుపు పంటకే కాకుండా మిర్చి, తదితర సుగంధ ద్రవ్యాల పంటలకు   స్పైసెస్‌ బోర్డు మేలు చేస్తుందని నమ్మబలుకుతూ నిజామాబాద్‌కు  స్సైసెస్‌ రీజినయల్‌ బోర్డును కేంద్ర వ్యవసా య శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌తో ఇటీవల  ప్రకటింపజేశారు. అయితే దీనిపై పసుపు రైతుల్లో ఏ మాత్రం సానుకూల స్పందన కన్పించడం లేదు.  స్పైసెస్‌ రీజినల్‌ బోర్డులో ప్రత్యేకంగా  పసుపునకు సంబంధించి మద్దతు ధర గానీ, కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు ఇతరత్రా మేలు చేసే అం శాలు లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు.  నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో ప్రధానంగా పసుపు పంటను రైతులు సాగు చేస్తారు.  ఇక్కడ ప్రత్యేకం గా పసుపు బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించడం వల్ల  మద్దతు ధరను కల్పించడంతో పాటు రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ,  నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీలు, గోదాముల నిర్మాణం, కొత్త కొత్త వంగడాలు, పరిశోధన తదితర ప్రయోజనాలు కలుగుతాయి. నేరుగా పండించిన పంట ను  ఇతర  ప్రాంతాలకు ఎగుమతి చేసుకొని గిట్టుబాటు ధర పొందేందుకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, స్పైసెస్‌ బోర్డులో వివిధ రకాల పంటల్లో పసుపు ఒక రకం మాత్రమే. దీని కి ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉండే అవకాశం లేదనేది  స్పష్టమవుతున్నది. వరంగల్‌లో 17 ఏళ్ల కిం దట ఏర్పడిన స్పైసెస్‌ రీజినల్‌ బోర్డులో పసుపు కూడా ఉంది. కానీ అక్కడ  అప్పటి నుంచి ఇప్పటి వరకు పసుపునకు గానీ, మిర్చికి గానీ మద్దతు ధర ఇచ్చింది లేదు. సదరు రైతులను ఆదుకున్నది లే దు. ఎన్నికల్లో  పసుపు బోర్డు అంటూ మాయ మాటలతో నమ్మించి సదరు ఎంపీ, బీజేపీ నాయకులు తీరా ఇప్పుడు పసుపు బోర్డు కాదు  స్పైసెస్‌ రీజినల్‌ బోర్డు అని చెప్పడంపై  పసుపు రైతులు  మండిపడుతున్నారు. స్పైసెస్‌ బోర్డుతో ప్రయోజనం లేదు 

సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం తో పసుపు రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. 1987లో కేరళలో 52 రకాల సుగంధ ద్రవ్యాలతో కూడిన స్పైసెస్‌ బోర్డు ఏర్పాటు చేశారు. అందులో పసుపు కూడా ఉంది. వరంగల్‌లో 17 ఏళ్ల కిందట రీజినల్‌ స్పైసెస్‌ బోర్డు నెలకొల్పారు. ఆ ప్రాంతంలో పసుపు రైతులకు గానీ, మిర్చి రైతులకు గానీ ఒకగూరిన ప్రయోజనం ఏం లేదు.   నిజామాబాద్‌ జిల్లాతో పాటు  కోరుట్ల నియోజకవర్గ ప్రాంతం  పసుపు పంట సాగుకు అనువైనది. వేలాది ఎకరాల్లో రైతులు తొమ్మిది నెలలు కష్టపడి పసుపు పంట పండిస్తారు.  30 ఏండ్ల కిందట పుట్టి ( రెండు క్వింటా ళ్లు) పసుపు మార్కెట్‌లో విక్రయిస్తే తులం బం గారం వచ్చేది. పసిడి పండించే పంట అని పసుపునకు పేరుండేది. ప్రస్తుతం పెట్టుబడి పెరిగి, మార్కెట్లో అరకొర ధర ఉండడంతో రైతులు అ ప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది.  స్పైసెస్‌ బోర్డుతో లాభం లేదని, పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం వల్లే మద్దతు ధర, ఇతర ప్ర యోజనాలు పొందే అవకాశం ఉంటుందనే ఆ లోచనతో 2006లో పసుపు రైతు సంఘం స్థా పించి ఉద్యమం ప్రారంభించాం. వ్యవసాయ ని పుణులు, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, గణాంక నిపుణులతో  క్షేత్ర స్థాయిలో అధ్యయనం చే శాం. పసుపు రైతుల సమస్యలను తెలుసుకు న్నాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రైతులతో కలిసి ధ ర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాం.  2014కు  ముందు  బీజేపీ జాతీయ నాయకులు సైతం పాల్గొని తాము అధికారంలో కి వస్తే  పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసు పు రైతులను ఆదుకుంటామని మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక  వారు కేంద్ర మంత్రులయ్యారు, ఉన్నత పదవులను చేపట్టారు కానీ పసుపు రైతుల సమస్యను పట్టించుకోలేదు.  2014లో నిజామాబాద్‌ ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల కవిత ఈ ప్రాంత పసుపు రైతుల గోడును విని వారి సమస్యకు పసుపు బోర్డు  ఏర్పాటే పరిష్కారమని భావించి అవిశ్రాంతంగా పోరా టం చేశారు. పార్లమెంట్‌లో అనేక సార్లు ప్రస్తావించారు.  ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు.  ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలిసి మద్దతు కూడగట్టారు. పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టారు. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే ఎక్కడ  ఆమెకు పేరు వస్తుందోననే కుట్రతోనే కేంద్రం అడ్డుకున్నది. ఈ క్రమంలో 2017లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రతి పంటకు బోర్డు ఏ ర్పాటు చేయడం మా విధానం కాదని ప్రకటించడమే అందుకు నిదర్శనం.  పసుపు బోర్డు ప్ర ధాన అంశం కావడంతో ఈ అంశాన్ని పసిగట్టిన బీజేపీ నాయకత్వం పార్లమెంట్‌ ఎన్నికల్లో  ఆ పార్టీ జాతీయ నాయకులు రాంమాధవ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌  పసుపు రైతులను బోర్డు పేరుతో మభ్యపెట్టారు.  ఎంపీ అభ్యర్థి అర్వింద్‌  బాండ్‌ పేపర్‌ కూడా రాసిచ్చారు. తీరా ఎన్నికల్లో లబ్ధిపొందాక తమ హామీని మరిచి  స్పైస్‌ రీజినల్‌ బోర్డును తెరపైకి తేవడం చూస్తే రైతులను మో సం చేసినట్లు స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా పసుపునకు ప్రత్యేక బోర్డు  ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయించాలి.  కనీస మద్దతు ధర ప్రకటించాలి.  బోర్డుకు ఐఏఎస్‌ స్థాయి అధికారి ఎండీగా ఉండడంతో పాటు స్థానిక ఎంపీలతో కలుపుకొని డైరెక్టర్లు ఉండాలి. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు కావాలి. దేశ, విదేశాలకు రై తులే లైసెన్స్‌తీసుకుని నేరుగా ఎగుమతి చేసుకొనే పరిస్థితులు రావాలి. కొత్త వంగడాలను సృ ష్టించుకోవాలి. పరిశోధనలు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ తదితర ప్రయోజనాలు రావాలి. ఇవన్నీ ప్రత్యేక బోర్డుతోనే సాధ్యమవుతాయి. పసుపు బోర్డు ఏర్పాటయ్యేదాకా మా పోరాటం కొనసాగిస్తాం. 

- కోటపాటి నర్సింహనాయుడు,  పసుపు రైతు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు


logo