మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Feb 12, 2020 , 01:22:53

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

మల్లాపూర్‌ : టీఆర్‌ఎస్‌ సర్కారుతోనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం మల్లాపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషణ్‌ భగీరథ పనులను వేగవంతం చేయాలని, పనులు చేయని కాంట్రాక్టర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో నూ మార్చి నెలాఖరులోగా ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీటిని అందిచాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుర్తిం పు పొందాయనీ, ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారనీ, గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తెచ్చి పరిష్కంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ నారదాసు మాట్లాడుతూ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేస్తేనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతాయన్నారు. అధికారులు తప్పనిసరిగా ప్రొటోకాల్‌ పాటించాలని సూచించారు. అనంతరం సర్పంచులకు ఐడీ కార్డులను అందజేశారు. సమావేశంలో మొగిలిపేటలో కొన్నేండ్ల నుంచి రైతులకు వరి ధాన్యం కోనుగోలు కేంద్రాల నుంచి రావాల్సిన హమాలీ చార్జీలు రావడం లేదని, ఇప్పటి వరకు సుమారు రూ.12లక్షల హమాలీ డబ్బు దుర్వినియోగమైనట్లు సర్పంచ్‌ నాగరాజు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు వివరించారు. ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. మండల వ్యాప్తంగా ఇసుక రీచ్‌ లేక ఇండ్ల నిర్మాణాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వెంటనే ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయాలని సిరిపూర్‌ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి కోరారు. గ్రామాల్లోకి మండల స్థాయి అధికారులు వచ్చినప్పుడు తమకు సమాచారం ఇవ్వడం లేద ని సిరిపూర్‌ సర్పంచ్‌ గోవింద్‌నాయక్‌ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సభ్యులు అడిగిన సమస్యలకు సంబంధిత అధికారులు స్పందించి వెంటనే శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎ మ్మెల్యే ఆదేశించారు. ఇక్కడ ఎంపీపీ కాటిపల్లి స రోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తాసిల్దా ర్‌ రమేశ్‌, ఎంపీడీవో కోటేశ్వర్‌రావు, వైస్‌ ఎంపీపీ గౌరు నాగేశ్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు సత్తార్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. 

సమష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాలి

ఇబ్రహీంపట్నం: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ కార్యాలయంలో  ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్పీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈసందర్భంగా అధికారులు ఎజెండా అంశాలను సభలో చదివి వినిపించారు. పలువురు సభ్యులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై  ప్రస్తావించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి సహకారంతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ర్టాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని అధికారులు, ప్రజాప్రతినిదులు శాలువా, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కంఠం భారతి, వైస్‌ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, ఎంపీడీవో శైలజారాణి, డిప్యూటీ తాసిల్దార్‌ గీతాంజలి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.  


logo
>>>>>>