శనివారం 28 మార్చి 2020
Jagityal - Feb 12, 2020 , 01:21:01

మాత్ర వల్లే మృతిచెందిందని చెప్పలేం

మాత్ర వల్లే మృతిచెందిందని చెప్పలేం

ధర్మపురి, నమస్తే తెలంగాణ: అల్బెండజోల్‌ మాత్ర వికటించడం వల్లే ధర్మపురిలో ఎనిమిదేళ్ల పాప సహస్ర మృతి చెందిందని చెప్పలేమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. సహస్ర మృతిపై ధర్మపురిలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బృందంతో కలిసి మంగళవారం వి చారణ చేపట్టారు. మొదట సహస్ర తల్లిదండ్రులు, బంధువుల వద్దకు వెళ్లి విచారించారు. రెండు రో జుల ముందు నుండి పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఇతర మందులైమైనా వాడుతున్నా రా..?,ఆల్బెండజోల్‌ మాత్ర గతేడాది వేశారా..? మాత్ర ఎక్కడ వేయించారు?, వేసిన తర్వాత ఎం తసేపటికి పాపకు ఫిట్స్‌ వచ్చాయి?, ఇలా ప్రశ్నలు వేసి విచారించారు. అనంతరం అంగన్‌వాడీ కేం ద్రంలో మాత్ర ఇచ్చిన ఆశా కార్యకర్తను, అంగన్‌వాడి సిబ్బందిని విచారించారు. అనంతరం ధర్మపురిలో సహస్రకు ప్రథమ చికిత్స అందించిన వై ద్యులు శ్రీనివాస్‌ను విచారించారు. ఆసుపత్రికి సహస్రను తీసుకువచ్చిన సమయంలో పల్స్‌ ఎలా ఉంది..?, ప్రథమ చికిత్సకు మందులు ఏమై నా ఇచ్చారా..? తదితర అంశాలపై ప్రశ్నించారు. అనంతరం సహస్ర చదివే కేరళ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులను సంఘటన జరిగిన రోజున సహస్ర పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అస్వస్థతకు గురై చికిత్స పొందిన మరో 21 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి..వారు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు తదితర అంశాలపై వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ జేడీ చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రోజున దాదాపు కోటి మందికి పైగా విద్యార్థులు, చిన్నారులకు అల్భెండజోల్‌ మాత్రలు పం పిణీ చేశామని, రాష్ట్రంలో ఎక్కడాకూడా ఇలాంటి సంఘటనలు  చోటుచేసుకోలేదన్నారు. సహస్రకు ఇచ్చిన అల్బెండజోల్‌ మాత్ర స్లిప్‌ను టెస్టుకు పంపించామన్నారు. తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల ఉపాధ్యాయులు, మాత్ర ఇచ్చిన అంగన్‌వాడీ సిబ్బందిని, ప్రథమచికిత్స నిర్వహించిన వైద్యులను విచారించి వారి ద్వారా సమాచారం సేకరించామన్నారు. బాడీకి సంబంధించిన విజా రా మొత్తం పరీక్ష కోసం వరంగల్‌ ల్యాబ్‌కు పంపా మన్నారు. అలాగే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, పోస్టుమార్టం రిపోర్టు కూడా రావాల్సి ఉన్నదన్నారు. అల్బెండజోల్‌ మాత్ర వికటించడం వల్లే మరణం సంభవించిందని చెప్పడానికి ఆధారాల్లేవన్నారు. పోస్టుమార్టం రిపోర్టు, ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత సహస్ర మృతికి గల కారణాలు చెప్పవచ్చన్నారు. ఆయన వెంట రాష్ట్ర కుటుంబ నియంత్రణ జాయింట్‌ డైరెక్టర్‌ డా.సాల్మాన్‌, నేషనల్‌ డీ వార్మింగ్‌డే ఇన్‌చార్జి డా.నందిత, జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌, జిల్లా మలేరియా ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీపతి, ధర్మపురి వైద్యులు శ్రీనివాస్‌, నరేశ్‌, సిబ్బంది ఉన్నారు. 


logo