శనివారం 28 మార్చి 2020
Jagityal - Feb 12, 2020 , 01:21:01

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

మెట్‌పల్లి టౌన్‌: వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని కొత్త బస్టాండు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేడిస్‌ జిమ్‌ను మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రణవేని సుజాతతో కలిసి ఆయన ప్రారంభించి వ్యాయామం చేసి జిమ్‌ పరికరాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, నిర్వాహకులు లేడిస్‌ జిమ్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చంద్రశేఖర్‌రావు, జిమ్‌ నిర్వాహకులు ఎండీ జావిద్‌ పటేల్‌, మెట్‌పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, కౌన్సిలర్లు మర్రి సహదేవ్‌, ఒజ్జెల బుచ్చిరెడ్డి, అంగడి పురుషోత్తం, టీఆర్‌ఎస్‌ నాయకులు మాడిశెట్టి ప్రభాకర్‌, పిప్పెర రాజేశ్‌, సోహెల్‌, షేక్‌ మహ్మద్‌, మార్గం గంగాధర్‌, శ్రీనివాస్‌, నాగభూషణం, ఆల్‌రౌండర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.


logo