బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Feb 12, 2020 , 01:20:19

పేద కుటుంబాలకు అండగా సీఎం సహాయనిధి

పేద కుటుంబాలకు అండగా సీఎం సహాయనిధి

కొడిమ్యాల: పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నా రు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం రూ.5 లక్షల 98 వేల 500 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను చొప్పదండి క్యాంప్‌ కార్యాలయం లో పంపిణి చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపదలో ఉండి వైద్యం చే యించుకోలేని వారికి సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. ఎవరికైనా వైద్యం చేయించుకునేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంటే ముందస్తుగా ఎల్‌ఓసీ అం దిస్తార న్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు మేన్నే ని రాజనర్సింగరావు, వైస్‌ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు అనుమండ్ల రాఘవరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. logo
>>>>>>