గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 11, 2020 , 01:27:26

నులిని నివారిద్దాం

నులిని నివారిద్దాం

జగిత్యాల, నమస్తే తెలంగాణ : నులిపురుగుల మాత్రలను తప్పనిసరిగా వేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పిలుపుని చ్చారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఖిల్లాగడ్డలోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ గతంలో పల్స్‌ పోలియేను శాశ్వతంగా నివారించామని, అదేవిధంగా నులిపురుగుల నిర్మూలించడం కోసం ఈ మాత్రలు తప్పని సరిగా వేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. దీని వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు పరిశుభ్రంగా ఉండడంతో, విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటున్నారన్నారు. ఈ నులిపురుగుల మాత్రలను జాతీయ స్థాయిలో ప్రారంభించారని, ప్రతి ఒక్కరూ 1- 19 ఏళ్ల వయస్సు గలవారంతా వేసుకోవాలన్నారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ మందులు పంపిణీ చేస్తారని, విద్యార్థులందరూ మాత్రలు వేసుకోవాలన్నారు. పరిశుభ్రత లోపించడం వల్లనే అనారోగ్యానికి గురవుతున్నారని, అందుకే విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని, వేడి వేడి ఆహారం తీసుకోవాలని, బయటి ఆహార పదార్థాలు తినకూడదన్నారు. కలెక్టర్‌ జీ రవి మాట్లాడుతూ ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికీ జిల్లా వ్యాప్తంగా ఈ మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మాత్రలు అంగన్‌వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలలో కూడా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సరఫరా చేశారన్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో ఈ మాత్రలు వేసుకుంటారన్నారు. పిల్లలకు పౌష్టికాహార లోపం, రక్తహీనత, శారీరక, మానసికంగా ఎదుగుదల లేక నీరసంగా ఉంటారని, చదువుల్లో ఏకాగ్రత ఉండదన్నారు. మాత్ర లు వేసిన అనంతరం వారి దగ్గరే వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారని, ఈ రోజు మాత్రలు వేసుకోని వారు ఈనెల 17వ తేదీన మలివిడత మాత్రలు వేస్తారన్నారు. జగిత్యాల మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువ మంది పిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడడం వల్ల, ఆపరిశుభ్రంగా ఉండడం వల్ల అనారోగ్యానికి గురవుతారన్నారు. ఈ లక్షణాలు ఉన్న పిల్లలు ఎదుగుదల రాకుండా, రక్తహీనత ఉంటుందని, అందుకే ప్రభుత్వం ఇచ్చిన మాత్రలను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు పంపుతున్నట్లు, వీటిని తప్పకుండా మాత్రలు వే సుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ నరేందర్‌, డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జైపాల్‌ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo