గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 11, 2020 , 01:25:43

కనులపండువలా రథోత్సవాలు

కనులపండువలా రథోత్సవాలు

కథలాపూర్‌/వెల్గటూర్‌/బుగ్గారం: జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం రథోత్సవాలు కనుల పండువలా సాగాయి.  కథలాపూర్‌ మండలం తాండ్య్రాలలో వేంకటేశ్వరస్వామి ని రథంలో ఉంచి గ్రామంలోని ప్రధానవీధుల్లో ఊరేగించగా భక్తులు మంగళహారతు లతో స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకు న్నారు. ఇక్కడ సర్పంచ్‌ గడిల గంగప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, ఉపసర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి, అర్చకులు సీతరామాచార్యు లు, ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెల్గటూర్‌ మండలం స్తంభంపల్లిలో వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కొండపై గల వేంకటేశ్వర స్వామి అలివేలు మంగ, ఆండాళు ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం కిందకు తీసుకువచ్చి  అందంగా అలంకరించిన రథంలో ఉంచి ఉత్సవం నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉద యం నుంచి క్యూలైన్లలో నిలబడి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్‌ సల్లూరి రూపరాణి, ఎంపీటీసీ పొడేటి సత్తయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బుగ్గా రం మండల కేంద్రంలో ముత్యాల పోశమ్మ, నల్ల పోశమ్మ అమ్మవార్ల జాతర అంగరంగ వైభవంగా జరిగింది.  భక్తులంతా కలిసి అమ్మవార్ల రథాన్ని గుడి చుట్టూ మూడు సార్లు తిప్పి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవార్ల జాతరలో మొక్కులు తీర్చు కున్నారు. అన్నదానం అనంతరం వేడుకలు ముగిశాయి. ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ రక్షణ దళ సభ్యు లు వసతులు ఏర్పాటు చేశారు. ఏఎస్‌ఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించా రు. ఇక్కడ సర్పంచ్‌ మూల సుమలత, ఎంపీ పీ బాదినేని రాజమణి, వైస్‌ ఎంపీపీ సుచేందర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు రహమాన్‌, ఉప సర్పంచ్‌ చుక్క శ్రీనివాస్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ చుక్క సుధాకర్‌, పొన్నం సత్తయ్య, రెంటం సరోజన, గంజి జగన్‌, జంగ శ్రీనివాస్‌, నన్నె విజయలక్ష్మి, పొన్నం శంకర్‌, నక్క జితేందర్‌, పెద్దనవేణి శంకర్‌, కప్పల మల్లేశ్‌, సుంకం ప్ర శాంత్‌, నగునూరి నర్సగౌడ్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


logo