గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 11, 2020 , 01:25:09

అభివృద్ధి దిశగా గ్రామాలు

అభివృద్ధి దిశగా గ్రామాలు

మెట్‌పల్లి,నమస్తే తెలంగాణ: పల్లె ప్రగతి కార్యక్రమంతో అభివృద్ధిలో గ్రామాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెప్రగతితో గ్రామాల్లో  మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సంపూర్ణ పారిశుధ్య లక్ష్యంగా   చెత్తాచెదారం ఎక్కడా నిల్వ ఉండకుండా నేరుగా డంప్‌యార్డుకు తరలించేందుకు అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. చెత్తాచెదారాన్ని డంప్‌యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్‌ను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. పట్టణాలతోపాటు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎంపీపీలు మారు సాయిరెడ్డి, భీమేశ్వరి, సర్పంచ్‌ పీసు తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్‌ బద్దం నాగ రత్నాకర్‌, కార్యదర్శి రవళిక, పంచాయతీ సభ్యులు శంకర్‌, రాజేశ్‌, రమేశ్‌, మహేశ్‌, తిరుపతి, మనోజ్‌ తదితరులున్నారు. 

 సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌దే విజయం 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం  పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో గొర్రెపల్లి నుంచి 5వ వార్డులో డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బోయిని పెద్ద కొండయ్య, రేగుంట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన బాల్క సరోజ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లను ఎమ్మెల్యే అభినందించారు. అన్ని సంఘాల్లో  పాలక మండళ్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ బాల్క ముత్తమ్మ, గొర్రెపల్లి సర్పంచ్‌ కొంపల్లి విష్ణు, నాయకులు ఏలేటి వెంకట్‌రెడ్డి, కదుర్క నర్సయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు

కోరుట్లటౌన్‌: పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వీరికి గులాబీ కండువా కప్పిన ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ కౌన్సిలర్‌ చిట్యాల లక్ష్మణ్‌, నాయకులు సుతారి రాకేశ్‌, సంగ శారద, లక్ష్మణ్‌, సుతారి సత్యనారాయణ, చిట్యాల కరుణాకర్‌, జాగర్ల చిలుకమ్మ, జెట్టి లింగంతోపాటు 100మంది కార్యకర్తలు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులున్నారు.


logo